Supreme court: ఇంగ్లీషు మీడియంను వ్యక్తిగతంగా సమర్ధిస్తాం

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లీషు మీడియం బోధనను వ్యక్తిగతంగా సమర్ధిస్తానంటూ సుప్రీంకోర్టు జస్టి స్ ఎస్ ఎ బాబ్డే వ్యాఖ్యానించారు.

Last Updated : Oct 7, 2020, 12:10 PM IST
Supreme court: ఇంగ్లీషు మీడియంను వ్యక్తిగతంగా సమర్ధిస్తాం

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం విద్యాబోధనపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లీషు మీడియం బోధనను వ్యక్తిగతంగా సమర్ధిస్తానంటూ సుప్రీంకోర్టు జస్టి స్ ఎస్ ఎ బాబ్డే వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం..అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంగ్లీషు మీడియం విద్యాబోధనకు సంబంధించి 81, 85 జీవోలపై హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.  ఈ పిటీషన్ పై ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధనను వ్యక్తిగతంగా సమర్థిస్తానని, అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలను విచారణలో చొప్పించలేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వులు.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే అనేకమంది దళిత, మైనారిటీ, నిరుపేద విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయని తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ జోక్యం చేసుకుంటూ ఇదే విషయమై కర్ణాటకకు సంబంధించిన పిటిషన్‌ కూడా ఉందని, రెండింటిని కలిపి విచారిస్తామని చెప్పారు. ఇది ముఖ్యమైన, అత్యవసరంగా వినాల్సిన, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పరిష్కరించాల్సిన అంశమని సీనియర్‌ న్యాయవాది విశ్వనాథన్‌ కోర్టుకు నివేదించారు. Also read: Vizag Jobs 2020: విశాఖ‌ డీఎంహెచ్‌వోలో 322 పోస్టులకు నోటిఫికేషన్

ప్రతి మండల కేంద్రంలో ఓ తెలుగు మీడియం పాఠశాల

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 96 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారని కోర్టుకు తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో తెలుగు మీడియం పాఠశాల అందుబాటులో ఉంటుందని, అక్కడ చదువుకోవాలనుకునేవారికి ఉచిత రవాణా సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందన్నారు. చదువుకునే మీడియం నిర్ణయించుకునే హక్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిందని నివేదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే పై వ్యాఖ్యలు చేశారు. మీరు చెల్లుబాటు అయ్యే ఒకే కోణం గురించి చెబుతున్నారు. వ్యక్తిగతంగా నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఈ ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులం ఏకీభవిస్తున్నాం. ఇంగ్లిష్‌ థ్రూ అవుట్‌ అవర్‌ లైవ్స్‌ .. మేం వ్యక్తిగతంగా మీతో ఏకీభవిస్తున్నాం. కానీ మా అభిప్రాయాలను విచారణలో ఆపాదించాలని అనుకోవడం లేదు. సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. పిల్లలకు మాతృభాషలో పునాది పడటం చాలా ముఖ్యం..’ అని అన్నారు. గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని వ్యాఖ్యానిస్తూ  విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. 

ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులతో ప్రభుత్వ విద్యార్ధులు పోటీ పడగలగాలనే ఉద్దేశ్యంతో, విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్ అందించాలనే ఆలోచనతో ఏపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం విద్యాబోధనను ప్రవేశపెట్టింది. Also read: AP High Court: సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం

Trending News