Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాగల రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని, రుతు పవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు ( Rain in AP) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  


Read also : Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం.. వాస్తవానికి జూన్ 1 నాటికే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే జూన్ 1 నాడే రుతు పవనాలు కేరళను తాకాయి. దీంతో రుతు పవనాల రాక కొంత ఆలస్యమైనా.. జూన్ 7 నాటికి రాష్ట్రంలో ప్రవేశిస్తాయని జూన్ 4న వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అధికారులు భావించినట్టుగానే జూన్ 7 కంటే ఒక రోజు ముందుగానే రుతుపవనాలు ఏపీని తాకాయి. ఈ రుతు పవనాల రాక ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు కురిశాయి.


Read also : BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం


గత సంవత్సరం రుతుపవనాల రాక విషయానికొస్తే.. జూన్ 21న రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీంతో తూర్పు-మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ ప్రాంతాల్లోనూ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..