Stock Market Update: స్టాక్ మార్కెట్లు సోమవారం (Stocks closing bell) అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ (BSE Sensex) 32 పాయింట్లు బలపడి 60,718 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ (NSE Nify) 6.70 పాయింట్లు పెరిగి 18,102 వద్ద స్థిరపడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్​ఎంసీజీ, విద్యుత్​, ఫార్మా షేర్లు రాణించాయి. లోహ, బ్యాంకింగ్, ఆటో మొబైల్ షేర్లు డీలా పడ్డాయి. ఈ కారణంగా సూచీలు ఆరంభ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 61,036 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 60,597 కనష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,210 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,071 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. చివరి దశలో కాస్త తేరుకుంది.


Also read: Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్​ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


పవర్​గ్రిడ్​ 3.46 శాతం, ఐటీసీ 2.12 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.41 శాతం, నెస్లే 1.24 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.04 శాతం లాభాలను గడించాయి.


టాటా స్టీల్​ 3.24 శాతం, ఎం&ఎం 1.19 శాతం, బజాజ్ ఆటో 0.98 శాతం, ఎస్​బీఐ 0.89 శాతం, భారతీ ఎయిర్​టెల్ 0.77 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 155 కంపెనీలు లాభాలను గడించాయి. 15 కంపెనీలు నష్టపోయాయి. నేటి సెషన్​లో ఐఆర్​సీటీసీ 5 శాతం పెరిగింది.


Also read: Apple Store Workers: స్టోర్​ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!


Also read: SBI Card Alert: ఎస్​బీఐ కార్డ్​ యూజర్లకు షాక్​- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్​), హాంకాంగ్, సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు లాభాలతో ముగిశాయి. షాంఘై (చైనా) మాత్రం స్వల్పంగా నష్టపోయింది.


కాస్త పెరిగిన రూపాయి..


డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 0.06 శాతం పుంజుకుంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.48 వద్ద కొనసాగుతోంది.


Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం


Also read: Tips For reduce Expenses: ఈ టిప్స్​తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook