Tips For reduce Expenses: ఈ టిప్స్​తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!

Tips For reduce Expenses: మీరు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తున్నామని భావిస్తున్నారా? ఖర్చులను తగ్గించాలనుకున్నా కదరడం లేదా? అయితే మీకోసం వ్యక్తిగత ఆర్థిక ఇస్తున్న సలహాలు, సూచనలు తెలుసుకోండి ఇప్పుడే.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 07:08 PM IST
Tips For reduce Expenses: ఈ టిప్స్​తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి!

Financial plan to reduce unnecessary Expenses: మనం రోజువారీగా చేసే ఖర్చుల్లో కొన్న అవసరమైనవి కాగా.. మరి కొన్న మన కోరికలు, ఇష్టాల కోసం చేస్తున్నవీ ఉంటాయి. అయితే అవసరమైన ఖర్చులను పక్కన పెడితే.. మిగతా వాటిని అనవసర ఖర్చులుగా (unnecessary Expenses) పరిగణించ వచ్చు.

అనవసర ఖర్చుల వల్ల నష్టాలు..

అనవసర ఖర్చుల వల్ల.. తాత్కాలికంగా అనందం దక్కినా ధీర్ఘకాలంలో మాత్రం ఇబ్బందులు తప్పవని పర్సనల్ ఫినాన్స్​ నిపుణులు చెబుతున్నారు. వీటిని అదుపు చేసుకుంటే.. ఆర్థిక జీవనం సజావుగా సాగుతుందని అంటున్నారు. మరి అనవసర ఖర్చులు పెరిగిపోయాయని మీరు భావిస్తే.. వాటిని తగ్గించే ఆర్థిక ప్రణాళికతో (Best financial Plan) పాటు.. నిపుణులు ఇస్తున్న సలహాలు, సూచనలు మీ కోసం.

ఖర్చులను ట్రాక్​ చేయండి..

ఇటీవల డిజిటల్ లావాదేవీలు పెరిగి పోయాయి. అయితే వీటి వల్ల చాలా మంది ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎక్కడ ఖర్చు చేస్తున్నాం? ఎందుకు ఖర్చు చేస్తున్నాం? అనే విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. కార్డులో, డిజిటల్ వ్యాలెట్లలో ఉన్న సేవింగ్స్​తో ఖర్చుకు (How to tack Expenses) వెనకాడటం లేదు.

మీరూ ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటుంటే.. కొన్ని రోజులు నగదు వినియోగించడం మేలు. మరి అవసరమైతే తప్పా కార్డ్​లను వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల ఎంత ఖర్చు చేస్తున్నామనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఒక వేళ కార్డులను వాదలటం వీలవకుంటే.. ప్రతి రోజు లావాదేవీలను రాసిపెట్టుకోవాలంటున్నారు నిపుణులు. దీని ద్వారా అందులో అవసరమైని, అవసరం లేని వాటిని గుర్తించే వీలుంటుందని చెబుతున్నారు.

Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పురోగతి, భారీగా పెట్టుబడులు

ప్రీపెయిడ్ కార్డులను వాడొచ్చు..

ఇటీవలి కాలంలో ప్రీపెయిడ్ కార్డ్​లు (How to Use Prepaid cards) అందుబాటులోకి వచ్చాయి. అంటే ఇవి బ్యాంక్ డెబిట్​ కార్డ్​ల్లానే పని చేస్తాయి. అంటే.. ఈ కార్డును ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన చోట దాని నుంచే పేమెంట్స్ చేయాలి. దీని ద్వారా ఖర్చులపై నియంత్రణ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఒక నెలకు ప్రామాణికంగా తీసుకుంటే.. ఇంతే ఖర్చు చేయాలని ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. దీనితో ఆ నెలలో కార్డ్​లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ ఖర్చు చేయలేరు కాబట్టి.. ఆచి తూచి వ్యవహరించేందుకు వీలుంటుంది.

ఈ కార్డ్​లను ఉపయోగించి ఆన్​లైన్ షాపింగ్​తో పాటు.. ఏటీఎం నుంచి డబ్బులు కూడా విత్​డ్రా (కొన్ని రకాల కార్డ్​లలో మాత్రమే) కూడా చేసుకోవచ్చు.

సైబర్ దాడులు జరిగినా.. ఈ కార్డ్​లో ఉన్న చిన్న మొత్తానికి మాత్రమే ప్రమాదం. పైగా దీనిని బ్యాంక్​కు అనుసంధానం చేయాల్సిన పని కూడా లేదు.

Also read: Electric Scooter: దేశంలో కారుచౌక ధరకే అందుబాటులో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్

డిజిటల్ వ్యాలెట్​..

ఇది కూడా ప్రీపెయిడ్‌ కార్డ్‌ తరహాలోనే పనిచేస్తుంది. కాకపోతే.. దీన్ని ఆన్‌లైన్‌ లావాదేవీలకు మాత్రమే వినియోగించే వెసులుబాటు ఉంటుంది. ఇక దీనిలో లోడ్‌ చేసుకోవాల్సిన సొమ్ము మన కేవీసీపై ఆధారపడి ఉంటుంది. పేటీఎం వాలెట్ వంటివి ఇందుకు ఉదాహరణ. అయితే వీటిని కేవలం ఆన్​లైన్ లావాదేవీలకు వాడొచ్చు. ఆఫ్​లైన్​లో కొన్ని చోట్ల వీటని అనుమతించకపోవచ్చు.

అయితే డిజిటల్​ వాలెట్లతో మరో ఉపయోగం ఏమిటంటే.. మీరు ప్రత్యేకంగా ఖర్చులను రాసిపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎదుకంటే.. వీటి ద్వారా చేసే ఖర్చులను బట్టి ఆయా వ్యాలెట్లు ఏ అవసరానికి ఎంత వాడారు అనేది విశ్లేషిస్తుంది.

Also read: Evergreening: కస్టమర్ల సమ్మతి లేకుండానే రుణాలిచ్చేసిన బ్యాంకు

వేతన జీవులు ఇలా కూడా చేయొచ్చు..

నెల నెలా వేతనం అందుకునే వారు.. మరో పద్ధతిలో ఖర్చులను తగ్గించుకోవచ్చు. ప్రీపెయిడ్ కార్డుల మాదిరిగా ఇప్పటికే ఉన్న ఓ బ్యాంక్ ఖాతాను వినియోగించుకోవ్చు. ముఖ్యంగా వేతనం జమ అయిన వెంటనే.. దానిని మరో బ్యాంక్​కు బదిలీ చేయాలి. దాని నుంచి ఎప్పుడు డబ్బులు డ్రా చేయడం లాంటివి చేయొద్దు.

ఖర్చులకు తగ్గట్లుగా.. మరో ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసుకుని.. దానిని మాత్రమే అన్ని అవసరాలకు వాడాలి (ఆన్​లైన్ షాపింగ్​లో ఆఫర్లకు మినహాయించి). దీనితో పాటు.. ఎప్పటికప్పుడు అకౌంట్ల బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. దీని ద్వారా ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు.

Also read: PNB reduces interest rates: పీఎన్​బీ ఖాతాదారులకు షాక్​- సేవింగ్స్ ఖాతాల వడ్డీకి కోత

చివరగా..

పైవన్నీ చేయాలంటే ముందు ఇష్టాలకోసం, ఆనందం కోసం చేసే ఖర్చులను వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లి లంచ్, డిన్నర్లు చేయడం కంటే.. ఇంట్లోనే వాటిని వండుకోవడం బెటర్​. ఇక వినోదాల విషయానికొస్తే.. మల్టీ ప్లెక్స్​ సినిమాలను కాస్త తగ్గించి.. ఓటీటీల్లో ఇంట్లో అందరూ కలిసి సినిమాలు చూడొచ్చని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Also read: Rakesh Jhunjhunwala: ఆకాశ ఎయిర్​ నుంచి బోయింగ్​కు రూ.75 వేల కోట్ల ఆర్డర్​?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News