Mahesh Babu's Sarkaru Vaari Paata Movie Shooting in Spain: మహేష్ బాబు.. ఎంత కూల్ గా ఉంటారో తెలిసిందే.. ఎవరితోనూ పెద్దగా విభేదాలుండవు, షూటింగ్ లో కూడా తన పని తానూ చేసుకొని వెళ్లే స్టార్.. సామాజిక బాధ్యత కలిగిన మహేష్ బాబు చాలా మందికి వైద్యానికి, ఆరోగ్యానికి సహాయం చేస్తూనే ఉన్నా... ఎన్నడు బయటకి చెప్పారు. టాలీవుడ్ స్టార్ లలో ఒకరైన మహేష్ బాబు డౌన్ టూ ఎర్త్ మనిషి. మహేశా బాబుకు ఫ్యామిలీనే ప్రాణం.. ఎక్కువ సమయం కూడా పిల్లలతోనే కేటాయిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మహేష్ బాబుకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం నెట్లో హాల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న గ్యాప్ లో చాలా మంది మహేష్ బాబు అభిమానులు ఫోలోల కోసం, వీడియోల కోసం దగ్గరకి వచ్చారు. మహేష్ బాబు కూడా హోపికగా, మాస్క్ తీసి ఫోటోలకు, వీడియోలకు అభిమానులతో ఫోజులిచ్చారు. 




Also Read: Unstoppable Talk Show Promo: 'వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' అంటున్న బాలయ్య


అయితే ఇదంత వీడియో తీసిన ఒక అభిమాని "మహేష్ బాబు క్రేజ్ ఇన్ స్పెయిన్" అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. అంతే... ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియో చూడండి 


మహేశ్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' (mahesh babu sarkaru vaari paata) చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు అందిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల కానుంది.


Also Read: Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి