SVP shooting: సర్కారు వారి పాట షూటింగ్‌లో కీర్తి సురేష్‌తో Namrata Shirodkar

Namrata Shirodkar on SVP sets in Spain: మహేష్ బాబు సినిమా షూటింగ్‌లో మహేష్ బాబు ఒక్కడుంటేనే ఆ సెట్స్‌లో ఎంతో సందడి ఉంటుంది. అలాంటిది ఆ షూటింగ్‌లో సూపర్ స్టార్ సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా జాయిన్ అయితే అక్కడ ఇంకెంత సందడిగా ఉంటుందో ఊహించుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 12:12 AM IST
SVP shooting: సర్కారు వారి పాట షూటింగ్‌లో కీర్తి సురేష్‌తో Namrata Shirodkar

Namrata Shirodkar on SVP sets in Spain: సర్కార్ వారి పాట షూటింగ్‌లో మహేష్ బాబుతో పాటు ఆయన భార్య, హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ కూడా ప్రత్యక్షమైతే షూటింగ్ లొకేషన్‌లో ఎంత సందడిపూరితమైన వాతావరణం ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అవును.. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలోని డ్యూయెట్స్ షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు స్పెయిన్‌లోని బార్సెలోనాకు వెళ్లారు (SVP shooting). అక్కడే పలు పాటల చిత్రీకరణ జరుగుతోంది. 

అయితే, పనిలో పనిగా పిల్లలు గౌతం, సితారలతో కలిసి బార్సెలోనాలోని పర్యాటక అందాలు చుట్టేసి రావడానికి వెళ్లిన నమ్రతా శిరోద్కర్.. మధ్యలో కొంత సమయం తీసుకుని సర్కారు వారి పాట షూటింగ్ లొకేషన్‌కి వెళ్లింది (Mahesh Babu family in Barcelona). షూటింగ్ మధ్య గ్యాప్‌లో సర్కారు వారి పాట యూనిట్ సభ్యులతో కలిసి సరదాగా ముచ్చటించింది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన జంటగా నటిస్తున్న కీర్తి సురేష్‌తోనూ (Namrata Shirodkar with Keerthy Suresh) కాసేపు సరదాగా ముచ్చటించి కీర్తి సురేష్‌కి సైతం సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిందామె. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Also read : Bangarraju release date: బంగార్రాజు రిలీజ్ డేట్ ఫిక్స్ ? Bheemla Nayak తో క్లాష్ తప్పదా ?

ఈ సందర్భంగా సర్కారు వారి పాట షూటింగ్ (SVP shooting latest updates) సెట్స్‌లో కీర్తి సురేష్‌తో ముచ్చటిస్తుండగా క్లిక్‌మనిపించిన ఫోటోను నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar at SVP shooting) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోకు దాదాపు 75 వేలకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. ఇక కామెంట్స్ లెక్క అయితే చెప్పనక్కరేలేదు.

Also read : RRR movie pre-release event: దుబాయ్‌లో ఆర్ఆర్ఆర్ ప్రి-రిలీజ్ ఈవెంట్ ?

Also read : Samantha: ఆ లింక్స్ వెంటనే తొలగించండి.. పర్సనల్ పోస్టులు చేయకంటూ సమంతకు కోర్టు హితవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News