Mahesh babu: 'సర్కారు వారి పాట' వీడియో లీక్.. మహేశ్ లుక్ సూపర్!

Super Star Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ  సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయ్యి..నెట్టింట వైరల్ గా మారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 07:18 PM IST
Mahesh babu: 'సర్కారు వారి పాట' వీడియో లీక్.. మహేశ్ లుక్ సూపర్!

Mahesh babu sarkaru vaari paata: మహేశ్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'(mahesh babu sarkaru vaari paata) . ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్(Spain)లో శరవేగంగా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్(sarkaru vaari paata leaked song)గా మారింది. ఈ వీడియోలో లొకేషన్ లో మహేశ్ బాబు, మహిళా డ్యాన్సర్ల బృందం కనిపిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టార్ కొరియాగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో మహేశ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.

Also read: Samantha: ఆ లింక్స్ వెంటనే తొలగించండి.. పర్సనల్ పోస్టులు చేయకంటూ సమంతకు కోర్టు హితవు

కాగా, సెట్‌లో తీసిన మహేశ్‌ ఫొటోను సంగీత దర్శకుడు తమన్‌(Taman‌) షేర్‌ చేశారు. స్టైలిష్‌ లుక్‌లో, గొడుగు పట్టుకుని కనిపించారు మహేశ్. మరో ఫొటోలో ఇదే లొకేషన్‌లో నాయిక కీర్తి సురేశ్‌(Keerthi Suresh)తో మాట్లాడుతూ కనిపించారు మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌(Namrata Shirodkar). ఇలా ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజ్‌లు రావడం వల్ల మహేశ్‌ అభిమానులు ఆనందంతో గెంతులేస్తున్నారు.  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News