Renu Desai directing Telugu movie: రేణు దేశాయ్.. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు ఆడియెన్స్‌ని తన అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్‌గా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ప్రేమించి పెళ్లి చేసుకున్న నటిగా, ఆ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి విడిపోయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే తాపత్రయంతో తనని తాను నిరూపించుకునేందుకు సినిమాలు డైరెక్ట్ చేస్తున్న మహిళా దర్శకురాలిగా రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. Also read : Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్లిపోయిన తర్వాత అక్కడ మరాఠిలో చిత్రాలు డైరెక్ట్ చేసే పనిలో బిజీ అయిన రేణు దేశాయ్ త్వరలోనే తెలుగులోనూ ఒక సినిమా డైరెక్ట్ చేయనున్నట్టు గతంలోనే చెప్పుకున్నాం. రైతుల ఇబ్బందులు, వారి కష్టాలే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు చెప్పిన రేణు దేశాయ్.. లాక్‌డౌన్‌కి ముందే తన కథాంశంపై పలు అధ్యయనాలు సైతం చేసింది. Also read : Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...


రేణు దేశాయ్ అనుకున్నట్టే అన్నీ జరిగి ఉంటే.. కరోనావైరస్ ( Coronavirus ) అనేది రాకపోయుంటే.. ఇప్పటికే రేణు దేశాయ్ ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి ఉండేది. కానీ కరోనావైరస్ అందరి ప్లాన్స్‌ని తలకిందులు చేసినట్టే రేణు దేశాయ్ తెరకెక్కించాలనుకున్న తెలుగు సినిమాను కూడా హాల్ట్ అయ్యేలా చేసింది. తాజాగా సినిమా షూటింగ్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా మళ్లీ తెలుగు సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. Also read : Kangana Ranaut: అప్పుడు ఇలానే మాట్లాడేవారా? జయబచ్చన్‌పై కంగనా సీరియస్


ఈ సినిమా కోసమే తెలుగు కవి, గేయ రచయిత, గాయకుడు గోరేటి వెంకన్నను ( Goreti Venkanna ) తాజాగా ఆయన ఫామ్ హౌజ్‌లో కలిసి తన సినిమాకు అవసరమైన పాటలు అందించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. రైతుల జీవితాలపై సినిమాను తెరకెక్కించడం పూర్తయిన అనంతరం నేతన్నల ఇబ్బందులపై దృష్టిసారిస్తూ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. Also read : Chiranjeevi: మెగాస్టార్ గుండు లుక్ సిక్రెట్ ఇదే..


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR