రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్...

ఇరవై సంవత్సరాల క్రితం బద్రి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల తార రేణుదేశాయ్ కొన్ని సినిమాలకే పరిమితమై నటనకు గుడ్ బై చెప్పింది. మోడలింగ్ నుండి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని

Last Updated : May 2, 2020, 11:43 PM IST
రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్...

హైదరాబాద్: ఇరవై సంవత్సరాల క్రితం బద్రి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల తార రేణుదేశాయ్ కొన్ని సినిమాలకే పరిమితమై నటనకు గుడ్ బై చెప్పింది. మోడలింగ్ నుండి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పూణెలో స్థిరపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆమె తరుచుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్నారు.

Also read : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

అయితే ఓ అభిమాని నుంచి రేణుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. సినిమాల్లో రీఎంట్రీ గురించి అడుగుతూ ప్రభాస్, మహేష్‌లకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు. దీనికి రేణు దేశాయ్ సమాధానమిస్తూ హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని, ఇక ఏ దర్శకుడైన తనను వృద్దాప్య ఛాయలున్న పాత్రలో చూపించగలరనుకుంటే మహేష్ బాబు లాంటి స్టార్లకు తల్లిగా నటిస్తానని చెప్పారు. ఇక టాలీవుడ్‌లో ఏదైనా మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రేణుదేశాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల్లోకి రేణు రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News