Jr Ntr`s 30th movie : జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్!!

RRR సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే డౌట్ ఇటీవల ఫిలింనగర్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

Last Updated : Feb 19, 2020, 07:40 PM IST
Jr Ntr`s 30th movie : జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్!!

RRR సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే డౌట్ ఇటీవల ఫిలింనగర్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేయనున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లో 30వ చిత్రం కావడంతో సినిమాపై అధికారిక ప్రకటన వెలువడక ముందు నుంచే ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ 30వ చిత్రం నిర్మాతలు ఈ సినిమాపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్ రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సైతం ట్విటర్ ద్వారా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

అరవింద సమేత తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా ఇదే కావడం మరో విశేషం. అరవింద సమేత ద్వారా ఎన్టీఆర్ సినిమాకు ఎమోషనల్ టచ్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి ఎటువంటి కథ రాసుకుంటున్నాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News