Coronavirus vaccine: ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ అక్టోబర్‌లో మార్కెట్‌లోకి ?
Vaccine to check Coronavirus: కరోనావైరస్‌కు వ్యాక్సీన్ అక్టోబర్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయా అంటే అవుననే అంటోంది ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ). అదే కానీ జరిగితే కరోనా వ్యాక్సీన్‌ను భారత్‌తో సహా ప్రపంచదేశాలకు అందించే సంస్థగా భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ( Serum Institute of India ) కి ఖ్యాతి దక్కనుంది.
Vaccine to check Coronavirus: కరోనావైరస్‌కు వ్యాక్సీన్ అక్టోబర్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయా అంటే అవుననే అంటోంది ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ). అదే కానీ జరిగితే కరోనా వ్యాక్సీన్‌ను భారత్‌తో సహా ప్రపంచదేశాలకు అందించే సంస్థగా భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ( Serum Institute of India ) కి ఖ్యాతి దక్కనుంది.
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్: ఆక్స్‌ఫర్డ్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19 వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా అమెరికా, చైనా, జపాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తలమునకలవుతున్నాయి. అన్ని కంపెనీల వ్యాక్సిన్ పరిశోధనలు ప్రస్తుతం ట్రయల్స్ దశల్లోనే ఉన్నాయి. అన్ని ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్నా సరే మార్కెట్లో అందుబాటులో రావడానికి కనీసం ఏడాది సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford university ) మాత్రం అందరికంటే ఓ అడుగు ముందే ఉంది. ఆ సంస్థ చేస్తున్న వ్యాక్సీన్ పరిశోధన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి మార్కెట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తోన్న జెన్నర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అడ్రెన్ హిల్ ( Jenner institute Director Adrian Hill ) స్వయంగా ప్రకటించారు. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
అడ్రెన్ హిల్ ఏం చెప్పారంటే..
స్పానిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రుమటాలజీ ( Spanish institute of rheumatology ) నిర్వహించిన వెబినార్‌లో ప్రొఫెసర్ అడ్రెన్ హిల్ చెప్పిన దాని ప్రకారం... తమ బృందం తయారు చేసిన Chadox1 n CoV-19 టీకా చింపాంజీలపై సత్ఫలితాలనిచ్చిందని... ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పరిశోధనలకు సంబంధించిన పూర్తి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆస్ట్రాజెనికాతో ( AstraZeneca )కలిసి బ్రెజిల్‌లో వాలంటీర్లపై కూడా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే వ్యాక్సీన్ రేసులో తొలిస్థానంలో ఉన్నది ఆక్స్‌ఫర్డ్ సంస్థే కావడం విశేషం. దక్షిణాఫ్రికాలో 2 వేల మందిపై ఈ వ్యాక్సీన్‌ను ప్రయోగించగా... బ్రిటన్‌లో 4 వేల మంది నమోదు చేయించుకున్నారు. ( Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్‌ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)
అంతత్వరగా మార్కెట్‌లోకి ఎలా ?
ప్రస్తుతానికి ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్న వ్యాక్సీన్‌కు ఒకవేళ అక్టోబర్ నాటికి అనుమతులు వచ్చినా.. అదే నెలలో మార్కెట్‌లోకి ఎలా రాగలదనే సందేహం కలగకమానదు. అయితే, వ్యాక్సీన్‌పై ఓ వైపు ట్రయల్స్ కొనసాగుతుండగానే మరోవైపు ఇదే ఫార్ములాతో ఇప్పటికే వ్యాక్సీన్ ఉత్పత్తి కూడా ప్రారంభమవడమే ఈ రహస్యం వెనుకున్న కిటుకు అని తెలుస్తోంది. దీని కోసం వ్యాక్సీన్ రంగంలో సుప్రసిద్ధులైన బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా, ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ( Serum Institute of India )తో ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాక్సీన్ అన్ని ట్రయల్స్ దశను దాటి అనుమతులు సాధించిన వెంటనే… అప్పటికే ఉత్తత్తి అయి రెడీగా ఉన్న వ్యాక్సీన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే విధంగా ఆక్స్‌ఫర్డ్ ప్లాన్ చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నాటికి 2 బిలియన్ డోసుల ( 2 Billion doses of vaccine ) వ్యాక్సీన్ విడుదలకు సన్నాహాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ( Patanjali Coronavirus medicine: పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ? )
బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా, ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్‌లు వ్యాక్సీన్ రంగంలో సుప్రసిద్ధ కంపెనీలు. ఈ కంపెనీలకు చెందిన వ్యాక్సీన్‌లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో మార్కెట్ అవుతున్నాయి. ఇందులో బీసీజీ నుంచి మొదలుకుని మీజిల్స్, రుబెల్లా, ఎంఎంఆర్, హెపటైటిస్ తదితర అన్ని టీకాలున్నాయి. ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ రంగంలో పేరున్న ఈ రెండు కంపెనీలతో ఒప్పందం కారణంగా వ్యాక్సీన్ సక్సెస్ అయిన వెంటనే మార్కెట్‌లో అందుబాటులో తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ( Coronil tablets: చిక్కుల్లో పతంజలి కరోనా మందు )