Coronil tablets: చిక్కుల్లో పతంజలి కరోనా మందు

Coronil tablets formula: కరోనావైరస్ నివారణకు పతంజలి సంస్థ ( Patanjali ) మందు కనుక్కున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కొరోనిల్ ( Coronil tablets ) అనే ఆ మాత్రలతో 5 నుంచి 14 రోజుల్లో వైరస్ సోకిన వ్యక్తి నయం అవుతాడని పతంజలి తెలిపింది. దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ , ఐసీఎమ్మార్ (ICMR ) ఓ కీలక ప్రకటన చేసింది.

Last Updated : Jun 23, 2020, 10:28 PM IST
Coronil tablets: చిక్కుల్లో పతంజలి కరోనా మందు

Coronil tablets formula: కరోనావైరస్ నివారణకు పతంజలి సంస్థ ( Patanjali ) మందు కనుక్కున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కొరోనిల్ టాబ్లెట్స్ ( Coronil tablets ) అనే ఆ మాత్రలతో 5 నుంచి 14 రోజుల్లో వైరస్ సోకిన వ్యక్తి నయం అవుతాడని పతంజలి తెలిపింది. దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ , ఐసీఎమ్మార్ (ICMR ) ఓ కీలక ప్రకటన చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహహ్మారి కరోనాకు పతంజలి మందు కనుక్కున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే బ్రేకులు పడ్డాయి. దీనికి ఆయుష్ మంత్రిత్వశాఖ ( Ministry Of Ayush ), ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతి లేదని తెలిపింది. దాంతో పాటు ఈ మాత్రలకు సంబంధించిన ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది.

పతంజలి ప్రవేశపెట్టిన కొరొనిల్ ట్యాబ్లెట్స్‌పై ఒక ప్రకటన చేసిన ఆయుష్ విభాగం.. ఆ ఔషధం సమర్థత గురించి పరీక్షలు జరిగేంతవరకు దాన్ని ప్రచారం చేయడం ఆపివేయాలని పతంజలి సంస్థకు స్పష్టంచేసింది. అదే సమయంలో ఈ మందును తయారుచేయడానికి వాడిన ముడిపదార్థాలు, కంపోజిషన్ ( Coronil Composition ), దాన్ని ఎక్కడ పరీక్షించారు వంటి వివరాలు వెంటనే సమర్పించాలని ఆయుష్ ఆదేశాలు జారీ చేసింది. అంత వరకు మార్కెటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని సూచించింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News