కరోనావైరస్ ( Coronavirus ) తో యుద్ధం లో వేపాకు ( Neem ) కీలక పాత్రో షోషిస్తోంది. శాస్త్రవేత్తలు, వైద్యులు ఇదే చెబుతున్నారు. వైరస్ ను అంతం చేయడానికి వేపాకులో ఉన్న గుణాలు ఏ విధంగా ఉపయోగపడతాయో వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  All India Institute Of Ayurveda ( AIIA ) సంస్థ నిసర్గ అనే సంస్థతో చేతులు కలిపింది.



AIIA ప్రకారం అది త్వరలో అది హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న ESIC ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించనుంది. AIIAతో కలిసి పని చేయనున్న తొలి ఆయుర్వేద సంస్థ నిసర్గ్ కావడం విశేషం.


AIIA వైద్యులు, డైరక్టర్ అయిన డాక్టర్ తనుజా నెసారీ ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఎగ్జామినర్ గా ఎంపిక అయ్యారు. మొత్తం ఆరుగురు డాక్టర్ల ఈ టీమ్ మొత్తం 250 మందిపై పరీక్షలు నిర్వహించింది. కోవిడ్-19 ( Covid-19 ) ను అంతం చేయడంలో వేప ఎంత ఖచ్చితంగా పని చేస్తుందో టెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:-



ప్రస్తుతం దశల వారీగా మనుషులపై ట్రయల్స్ చేస్తున్నారని.. ఇప్పటి వరకు సానుకూల ఫలితాలు వచ్చాయి అని తెలిపారు. జ్వరంతో పాటు హెర్పెస్ వైరస్ ( Herpes Virus ) ను అంతం చేయడంలో వేప ఆకు ఉపయుక్తంగా ఉంది అని డాక్టర్ మోహినీ చెబుతున్నారు.


వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని.. ఒక కరోనావైరస్ ను అది ఏ మాత్రం అంతం చేయగలదో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది అని తెలిపారు పరిశోధకులు.