హైదరాబాద్ కు చెందిన రాధామౌనిక (18) చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మౌనిక ఆత్మహత్యకు యూనివర్సిటీయే కారణమని విధ్వంసం సృష్టించారు. దీంతో విద్యాలయంలో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా జనవరి 2వరకు సెలవులు ప్రకటించింది. గురువారం తెల్లవారుజామునే విద్యార్థులను హాస్టళ్లను ఖాళీ చేయించి ఇళ్లకు పంపేశారు.
అసలేం జరిగిందంటే..
రెండు రోజుల కిందట కాలేజీలో ఇంటర్నల్ పరీక్షలు జరిగాయి. ఆ ఎగ్జామ్ లో మౌనిక కాపీ కొట్టిందని ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపారు. మిగితా పరీక్షలు రాయడానికి కూడా అనుమతించలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక.. అదే యూనివర్సిటీలో చదువుతున్న సోదరుడికి వీడియో కాల్ చేసింది. మిస్ యు ఆల్, లవ్ యు ఆల్ అంతో స్నేహితులకు మెసేజ్ పంపి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి మృతికి యూనివర్సిటీ యాజమాన్యమే కారణమని మౌనిక తండ్రి రాజారెడ్డి ఆరోపించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య; వర్శిటీలో ఆందోళన