Covid 19 Restrictions: దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా మహమ్మారి విస్తరణ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు సైతం వ్యాపించింది. పెరుగుతున్న కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆంక్షలు పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020 మార్చ్‌లో ప్రారంభమైన కరోనా వైరస్(Coronavirus) దేశమంతా గజగజలాడించింది. అక్టోబర్ నుంచి తగ్గుముఖం పట్టి డిసెంబర్ నాటికి పూర్తిగా తగ్గిందనుకునేలోగా ఇప్పుడు మరోసారి వైరస్ విజృంభిస్తోంది. నిన్నటి వరకూ ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కోవిడ్ కేసులు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తోంది. రాష్ట్రాల్లో కరోనా వైరస్ పెరుగుతుండటంతో కోవిడ్ ఆంక్షలు (Covid Restrictions)తిరిగి అమల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్ర ( Maharashtra) లోనూ, పంజాబ్‌లోని 11 జిల్లాల్లో సైతం కోవిడ్  ఆంక్షలు విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మార్చ్ 31 వరకూ డ్రామా థియేటర్లు, ఆడిటోరియంలలో కేవలం 50 శాతం మాత్రమే అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో ఏకంగా 25 వేల కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేస్తోంది. 


ఆరోగ్యం, అత్యవసర సేవలకు సంబంధించి తప్ప మిగిలిన అన్ని కార్యాలయాలు కోవిడ్ నిబంధనల్ని పాటించాలని స్పష్టం చేసింది. ఆడిటోరియంలలో మత, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక సమావేశాలు నిర్వహించకూడదని తెలిపింది. నియమాల్ని ఉల్లంఘిస్తే ఆయా ప్రదేశాల యజమానులపై పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. తయారీ రంగంలో మాత్రం పూర్తి స్థాయి కార్మికులకు అనుమతిచ్చింది. లాక్‌డౌన్ అనేది ఐచ్ఛికమని..ప్రజలు నిబంధనలు పాటిస్తారని నమ్ముతున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav thackeray) తెలిపారు.


అటు పంజాబ్‌( Punjab)లోని 11 జిల్లాల్లో కోవిడ్ కేసులు అధికంగా కన్పిస్తున్నాయి. దాంతో కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో ఆంక్షలు  విధిస్తున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ (Amarinder singh) తెలిపారు. మరణాలు, పెళ్లిళ్లకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అన్ని రకాల విద్యా సంస్థల్ని నెలాఖరు వరకూ మూసివేస్తున్నట్టు చెప్పారు.


Also read: Bombay High Court: తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించవచ్చు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook