Bombay High Court: బోంబే హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి రెండో పెళ్లి అనేది పూర్తిగా అతని ఇష్టం కాదని స్పష్టం చేసింది. వివాహమనేది కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించిన వ్యవహారం కాదని చెప్పింది. అసలేం జరిగింది..
వివాహమనేది కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించిన వ్యవహారం కాదని చెప్పే ఘటన బోంబే హైకోర్టు(Bombay High court)లో చోటుచేసుకుంది. 2016లో ఓ మహిళ తన తండ్రి రెండో వివాహం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ప్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2003లో మహిళ తల్లి మరణించాక తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తండ్రి పెళ్లి చేసుకున్న మహిళ..తన మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంది. దాంతో ఆ తండ్రి కుమార్తె..తన తండ్రి పెళ్లిని ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించింది. తన తండ్రి ఆస్థుల్ని సవతి తల్లే అనుభవిస్తోంది. ఈ పెళ్లి చెల్లుబాటు కాదని ప్రశ్నించింది. అయితే వివాహమనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారమని..ఆ పెళ్లి చెల్లుబాటును కుమార్తె ఎలా ప్రశ్నిస్తుందని వాదించగా..ఫ్యామిలీ కోర్టు (Family court)సైతం సవతి తల్లికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ మహిళ బోంబే హైకోర్టును ఆశ్రయించింది.
తండ్రి రెండో పెళ్లి చెల్లుబాటును కోర్టులో ప్రశ్నించే అధికారం కుమార్తెకు ఉందని బోంబో హైకోర్టు స్పష్టం చేసింది. వివాహమనేది (Marriage) కేవలం ఇద్దరు వ్యక్తులకు చెందింది కాబట్టి భార్య లేదా భర్త మాత్రమే చెల్లుబాటును ప్రశ్నించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని జస్టిస్ ఆర్‌డి థనూక, జస్టిస్ విజీ బిషత్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. కన్నకూతురిగా తండ్రి రెండో పెళ్లిని ప్రశ్నించే అధికారం ఆమెకు ఉందని తేల్చి చెప్పింది బోంబే హైకోర్టు.
Also read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook