ఈ టెక్నాలజీ కాలంలో జీవితమంతా ఉరుకులు పరుగుల మీద గడిచిపోతోంది. కొందరు తొందరపాటులో తీసుకున్న నిర్ణయం వల్ల కెరీర్‌లో పైస్థాయికి చేరుకోలేక నిరుత్సాహానికి గురవుతారు. మరొకొందరు తమ అదృష్టం వల్లనో, లేక కఠిన శ్రమతోనే విజయవంతమవుతారు. పలానా ఇంట్లో పుట్టి ఉంటే నాకు అన్ని కలిసొచ్చేవని కొందరు  పిల్లలు సైతం ఆలోచిస్తుంటారు. అయితే ఓ నెలలో పుట్టిన పిల్లలు ఇతరుల కంటే చాలా చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆ ఆసక్తికర వివరాలపై మీరూ ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..


ఇతర నెలల్లో పుట్టిన పిల్లలతో పోల్చితే  సెప్టెంబర్ నెలలో పుట్టిన చిన్నారులు ఎక్కువ చురుకుగా ఉంటారట. చాలా తెలివిగా పనులు చేయాలని తపన పడతారని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ వారు స్కూల్ స్టార్టింగ్ ఏజ్ అండ్ కాంగ్నిటివ్ డెవలప్‌మెంట్ పేరుతో గతంలో చిన్నారులపై చేసిన అధ్యయనం ఈ ఆసక్తికర విషయాలు ప్రచురించింది.


కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?


6 నుంచి 15ఏళ్ల మధ్య వయసున్న 12లక్షల చిన్నారులపై అధ్యయనం చేశారు. కారణం ఏంటో తెలియదు గానీ... సెప్టెంబర్ నెలలో పుట్టిన పిల్లలు మాత్రం తెలివిగా మాట్లాడతారని తేలింది. ఆలోచనలు పెద్ద స్థాయిలో ఉంటాయని, అదే ఇతర నెలల్లో పుట్టిన పిల్లలకు ఈ తరహా మెచ్యూరిటీ రావాలంటో మరో ఏడాది సమయం అధికంగా తీసుకున్నారని రీసెర్చ్ చెబుతోంది. అదే సమయంలో సెప్టెంబర్‌లో పుట్టిన పిల్లలు స్కూల్లో ఆలస్యంగా చేరడం వల్ల అలా జరిగిందని మరికొన్ని సర్వేలు పేర్కొన్నాయి.


బీ అలర్ట్: WhatsAppలో ఈ10 తప్పులు చేస్తున్నారా? 


పిల్లలతో పాటు పెద్దవారిలోనూ సెప్టెంబర్ నెలలో జన్మించడం కలిసొచ్చిందట. తల్లిదండ్రులతో వీరికి అంతగా చనువు ఉండదని, వీరు నేరుగా తమ పనులు చక్కబెట్టుకునేందుకు యత్నిస్తారని రీసెర్చ్ ద్వారా తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాల నేరస్థుల్లో సెప్టెంబర్ నెలలో పుట్టిన వారిపై అతి తక్కువగా నమోదవుతున్నాయని గుర్తించారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా తమ పిల్లల్ని ప్రోత్సహించడం, వారు సొంతంగా ఆలోచించేలా చేస్తే చిన్నప్పటి నుంచే మానసికంగా  దృఢంగా తయారవుతారు. స్కూల్లో చేసే స్నేహాలు సైతం జీవితాలను తలక్రిందులు చేస్తాయని అధ్యయనం ప్రస్తావించింది.


Also Read: శుభవార్త.. ఉద్యోగులకు ఆ కష్టం ఉండదు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..