Side Effects Of Overthinking: నేటికాలంలో ఉరుకులు పరుగుల జీవితంగా మారిపోయింది. దీని కరణంగా తీవ్రమైన ఒత్తిడి , ఆలోచనలు, శ్రమ ఎక్కువగా ఉంటడం వల్ల శరీరం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతుంది. అయితే ఎక్కువ ఆలోచన వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి, ఆందోళన, భయం వంటి మానసిక సమస్యల వల్ల శరీరంలో కొన్ని హార్మోన్లను విడుదల అవుతాయి. ఇవి రక్తపోటును పెంచుతాయి, గుండె రేటును వేగవంతం చేస్తాయి, రక్త నాళాలను కుదుపుతాయి. ఈ మార్పులు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. దీంతో పాటు మరి కొన్ని హానికరమైన
అతిగా ఆలోచించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల స్ట్రోక్ , గుండెపోటు వంటి గుండె సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను పెంచుతుంది. మీరు అంతులేని ఆలోచనలు వల్ల నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. శరారీనికి నిద్రలేకపోవడం వల్ల గుండె సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. దీని కారణంగా మీరు ఉదయం అలసట, చీరాకు వంటి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన పనిపై దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. దీని వల్ల మీరు బరువు పెరుగుతారు.
అతిగా ఆలోచించడం వల్ల ఆకలి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ మెదడుపై తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. దీంతో పాటు తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు తలెత్తతాయి. అంతేకాకుండా అతిగా తినాలి అనే కోరిక కూడా పుడుతుంది. దీని వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఇటువంటి అలవాట్లు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి.
అతిగా ఆలోచించి ఒత్తిడికి గురైతే కార్టిసాల్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని వల్ల పలు అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది.
ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు చేయగలిగే పనులు:
మీరు ఉదయం పూట వ్యాయామం, యోగా, ధ్యానం వంటి పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రిపూట 7-8 గంటల నిద్ర పొవడం వల్ల ఈ సమస్యలు కలగవు.
మీరు ఎక్కువగా ఆలోచిస్తే ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని భావిస్తే, వైద్యుడిని లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం.
Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Overthinking Affect Health: అతిగా ఆలోచిస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం రిస్క్ లో పడే ప్రమాదం ఉంది