/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

mahindra xuv300 vs tata nexon which is better​: దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీ కార్లతో టాటా నెక్సాన్ అతి ముఖ్యమైంది. సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ ది బెస్ట్ వన్ అని చెప్పవచ్చు. ప్రజలు కూడా సేఫ్టీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటంతో కార్ల కంపెనీలు సేఫ్టీపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాయి. ఎస్‌యూవీల్లో మహీంద్రా వర్సెస్ టాటా నెక్సాన్ పోటీపడితే ఏది సరైన ఎంపికో తెలుసుకుందాం..

సేఫ్టీ ఎస్‌యూవీలను ఎంచుకోవల్సి వచ్చినప్పుడు ఇప్పటి వరకూ దేశ ప్రజల ముందు టాటా నెక్సాన్ మంచి ఆప్షన్‌గా ఉండేది. ఇప్పుడు మరో కొత్త ఆప్షన్ వచ్చి చేరింది. టాటా నెక్సాన్‌కు దీటైన కారుగా పరిగణిస్తున్నారు. కార్ల కంపెనీలు ఎక్కువగా సేఫ్టీ ప్రమాణాలపై దృష్టి సారిస్తూ ఆ దిశగానే కార్లు ఉత్పత్తి చేస్తున్నారు. కస్టమర్లు కూడా సేఫ్టీ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దీనికి కారణం. సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ కంటే దీటుగా ఉండి..ధర కూడా అత్యంత తక్కువగా ఉన్న కారు గురించి తెలుసుకుందాం.

టాటా నెక్సాన్‌కు దీటుగా ఉన్న ఎస్ యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 300. ఇది కూడా 4,5 స్టార్ సేఫ్టీ కలిగి ఉంది. అటు బడ్జెట్‌పరంగా, ఇటు సేఫ్టీ‌పరంగా చూస్తే టాటా నెక్సాన్ కంటే దీటైందిగా చెప్పవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వర్సెస్ టాటా నెక్సాన్ గురించి మాట్లాడితే సేఫ్టీ ప్రమాణాలు రెండింటికీ సమానమే. మహీంద్రా కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే సమయంలో ధర మాత్రం టాటా నెక్సాన్ కంటే చాలా తక్కువ. సౌకర్యం విషయంలో కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ 300 చాలా అనువుగా ఉంటుంది. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ కారు కంటే ఓ అడుగు ముందే ఉంటుంది. నెక్సాన్ కారుకు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ ప్రొటెక్షన్‌లో 5 స్టార్ రేటింగ్, ఛైల్డ్ ప్రొటెక్షన్‌లో 3 స్టార్ రేటింగ్ లభించింది. అదే మహీంద్రా ఎక్స్‌యూవీ 300కు అడల్ట్ ప్రొటెక్షన్ 5 స్టార్ లభించగా ఛైల్డ్ ప్రొటెక్షన్‌లో 4 స్టార్ రేటింగ్ లభించింది. ఇక ఇంజన్ గురించి పరిశీలిస్తే..మహీంద్రీ ఎక్స్‌యూవీ 300లో టాటా నెక్సాన్ కంటే ఎక్కువ శక్తివంతమైంది. ఇందులో 1.2 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 1100 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. టాటా నెక్సాన్ మాత్రం టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్నా 120 పీఎస్ పవర్ , 170 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇంజన్ విషయంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300..టాటా నెక్సాన్ కంటే ఎక్కవ శక్తివంతమైంది. టాటా నెక్సాన్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో 115 పీఎస్ పవర్ జనరేట్ చేస్తే..మహీంద్రా ఎక్స్‌యూవీ 300లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో 117 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. 

మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ధర కేవలం 8.42 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఎక్స్‌యూవీ 300లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ విత్ ఏబీఎస్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్ ఉంటాయి.

Also read: Airtel 1799 Plan: ఎయిర్‌టెల్ నుంచి సూపర్ ప్లాన్, అత్యంత తక్కువ ధరకు వార్షిక ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Indias best safest and cheapest suv mahindra Xuv 300 compare to tata nexon check the price, features and difference
News Source: 
Home Title: 

Mahindra Xuv 300 vs Tata Nexon: సేఫ్టీ, ధర విషయంలో శక్తివంతమైన ఎస్‌యూవీ

Mahindra Xuv 300 vs Tata Nexon: సేఫ్టీ, ధర విషయంలో శక్తివంతమైన ఎస్‌యూవీ, నెక్సాన్‌ను మర్చిపోండిక
Caption: 
Mahindra xuv 300 ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Mahindra Xuv 300 vs Tata Nexon: సేఫ్టీ, ధర విషయంలో శక్తివంతమైన ఎస్‌యూవీ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, June 11, 2023 - 15:29
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
51
Is Breaking News: 
No
Word Count: 
375