Kidney Cancer Symptoms: కిడ్నీ క్యాన్సర్ రావడానికి ముందు కనిపించే లక్షణాలు

Kidney Cancer Symptoms : ఆరోగ్యం నుంచి అనారోగ్యం బారినపడే దశలో కనిపించే లక్షణాలు చూసి అప్రమత్తమైతే.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా బయటపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. క్యాన్సర్ ని ఎంత త్వరగా గ్రహించుకుంటే.. ఆ జబ్బు నుంచి కోలుకునేందుకు అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనే విషయం తెలిసిందే.

Written by - Pavan | Last Updated : Jun 29, 2023, 06:46 PM IST
Kidney Cancer Symptoms: కిడ్నీ క్యాన్సర్ రావడానికి ముందు కనిపించే లక్షణాలు

Kidney Cancer Symptoms: తుఫాన్ రావడానికి ముందు భయంకరమైన గాలి వాన, ఉరుములు, మెరుపులు వార్నింగ్ ఇచ్చినట్టే... మనిషికి ప్రాణాంతకమైన వ్యాధులు, బాగా ఇబ్బందిపెట్టే జబ్బులు వచ్చే ముందు కూడా అదే విధంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యం నుంచి అనారోగ్యం బారినపడే దశలో కనిపించే లక్షణాలు చూసి అప్రమత్తమైతే.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా బయటపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. క్యాన్సర్ ని ఎంత త్వరగా గ్రహించుకుంటే.. ఆ జబ్బు నుంచి కోలుకునేందుకు అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనే విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే కిడ్ని క్యాన్సర్ రావడానికి ముందు మినిషి శరీరంలో కనిపించే మార్పులుచేర్పులు, అనారోగ్య సమస్యలు ఏంటి అనేవి ఇవాళ తెలుసుకుందాం. 

ఆకలి తగ్గిపోవడం : 
ఆకలి తగ్గిపోవడం, కొన్నిసార్లు ఆకలితో పాటు బరువు తగ్గిపోవడం వంటివి కిడ్నీ క్యాన్సర్ జబ్బులో సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు. ఇలాంటప్పుడు గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. వారికి ఆకలి లేకపోవడమే కాకుండా, ఆహారం తినేటప్పుడు తినడానికి ముందుగానే పొట్ట నిండుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

జ్వరం వచ్చి తగ్గుతుండటం : 
ఇలా ఉంది అని చెప్పడానికి వీలు లేని విధంగా జ్వరం వచ్చి తగ్గడం జరుగుతుంది. కిడ్నీలో రక్తం శుద్ధి జరిగి, మలినాలను తొలగించే చిన్న ట్యూబుల్లోనే కిడ్నీ క్యాన్సర్ వస్తుంది. అందుకే డిటెక్ట్ చేయడానికి వీలు లేవి విధంగా క్యాన్సర్ కారణంగా జ్వరం వస్తుంది.

వెన్ను కింది భాగంలో నిరంతరంగా నొప్పి :
కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడేవారికి వెన్ను కింది భాగంలో నొప్పు కలుగుతుంది. యూరిన్ పైపులో రక్తం గడ్డ కట్టడం వల్ల అలాంటి నొప్పి కలుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. 

హై బ్లడ్ ప్రెషర్ :
కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడేవారికి బీపీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మోషన్‌లో బ్లడ్ పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అనుకోకుండా బరువు తగ్గడం :
కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడే వారిలో తమ వంతు ప్రయత్నం లేకుండానే సన్నగా తయారై బరువు తగ్గిపోతుంటారు. కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడే వారికి ఆకలి తగ్గిపోతుంది అని మనం ముందుగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అనుకోకుండా వెంటవెంటనే బరువు తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ ఇన్‌ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు సోకడం కూడా ఒక కారణం అయ్యుండ వచ్చు. 

మత్తుగా ఉండటం :
రోజు మొత్తంలో ఎక్కువ శాతం మత్తుగా ఉండటం అనేది కిడ్నీ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. శరీరంలో న్యూట్రియెంట్స్ కోసం ఆరోగ్యంగా ఉన్న కణాలతో క్యాన్సర్ కణాలు పోటీపడటం కూడా అందుకు ఒక కారణమై ఉండొచ్చు. అలాగని మత్తుగా ఉండటం అది కిడ్నీ క్యాన్సర్ అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో, ఎన్నో అనారోగ్య సమస్యల విషయంలో మత్తుగా ఉండటం అనేది ఒక కారణంగా ఉంటుంది. ఉదాహరణకు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంతమందికి శరీరం మత్తుగా అనిపిస్తుంటుంది.

కాళ్లలో లేదా పాదాలలో వాపు : 
కాళ్లలో లేదా పాదాలలో నీరు పేరుకుపోయి కాళ్లు, పాదాలు వాపు రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే.. కిడ్నీ ఆరోగ్యంగా పనిచేసినప్పుడే శరీరంలోని ద్రవాన్ని మూత్రం రూపంలో బయటికి పంపించేస్తుంది. కిడ్నీల పని తీరు సరిగ్గా లేనప్పుడు అది సాధ్యపడదు. అందుకే ఈ సమస్య తలెత్తుతుంది.

వృషణాల వాపు :
రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం రూపంలో మలినాలను శరీరంలోంచి బయటికి పంపించడంలో కిడ్నీలది కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. అంతేకాకుండా శరీరంలోని ఇతర అవయవాల పని తీరు సక్రమంగా జరిగేలా చూడటంలోనూ కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కారణం కూడా శరీరంలోని అన్ని అవయవాలకు ప్రసరించే రక్తం శుద్ధి అయ్యేది ఇక్కడే కాబట్టి. అలా కిడ్నీల ఆరోగ్యం చెడిపోతే.. మొదటిగా ఆ ప్రభావం పడేది కూడా వృషణాలపైనే. అలా వృషణాలలో వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రాత్రి వేళ జ్వరం, చమట పట్టడం :
కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడే వారిలో రాత్రి వేళ విపరీతంగా చమటలు పట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఎక్కువ టెంపరేచర్‌తో జ్వరం రావడం కూడా అందుకు ఒక కారణం అయ్యుండవచ్చు. 

ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నట్టువంటి లక్షణాలు ఏమైనా ఇబ్బంది పెట్టేంత తీవ్రస్థాయిలో ఉన్నట్టయితే.. మీ డాక్టర్‌ని సంప్రదించి తగిన వైద్య సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం అనే విషయం మర్చిపోవద్దు.

Trending News