Delhi Floods Scary Pics: జలదిగ్భంధనంలో దేశ రాజదాని, భయం గొలుపుతున్న వరద దృశ్యాలు

Delhi Floods Scary Pics: దేశ రాజధాని ఢిల్లీని యుమునా నది వరద ముంచెత్తేసింది. భారీ వర్షాల కారణంగా యుమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ విలవిల్లాడింది. యమునా నది చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వరద బీభత్సం సృష్టించింది. 

Delhi Floods Scary Pics: దేశ రాజధాని ఢిల్లీ జలదిగ్భంధనంలో చిక్కుకుంది. యమునా నది విశ్వరూపం కన్పించింది. యమునా నదికి ఈ స్థాయి వరద పోటెత్తడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978కు ముందు తరువాత ఈ స్థాయి వరద రాలేదు. వరద బీభత్సంతో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెరువులు, నదులే దర్శనమిస్తున్నాయి.
 

1 /9

యమునా నది వరద కారణంగా ఢిల్లీ ఎర్రకోట కూడా జలదిగ్బంధనలో చిక్కుకుంది. ఎర్రకోట చుట్టూ వరద నీరే కన్పిస్తోంది.

2 /9

ఢిల్లీ వరదల కారణంగా ఇప్పుడు తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యమైన మూడు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేయాల్సి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

3 /9

ఢిల్లీ వరద కారణంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు, అధికారుల నివాసాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

4 /9

5 /9

ఢిల్లీ వరద బాధితుల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు చెందిన 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం వరద నీటి మట్టం తగ్గుతున్నట్టు సమాచారం.

6 /9

ఉత్తరాదిలోని కొండ ప్రాంతాల్లో, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గత 4-5 రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తుండటంతో యుమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. 

7 /9

8 /9

యమునా నది పెరుగుతున్న నీటిమట్టం కారమంగా ఢిల్లీలో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ఆదివారం వరకూ సెలవులు ప్రకటించారు. 

9 /9

దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరద కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. హర్యానాలోని హత్నికుడ్ బ్యారేజ్ నుంచి విడుదలైన వరద నీటితో యమునా నది నీటిమట్టం మరింతగా పెరిగిపోయింది.