Apple 2024 iPad Pro: ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొత్త మోడల్ త్వరలో లాంచ్, ఎలా ఉంటుందంటే

Apple 2024 iPad Pro: 2024లో హల్‌చల్ సృష్టించేందుకు ఆపిల్ సిద్ధమైపోయింది. ఆపిల్ ఐప్యాడ్ ప్రో సిరీస్‌లో చాలా మార్పులు కన్పించనున్నాయి. యూజర్లను ఇట్టే ఆకర్షించేందుకు ఆపిల్ కంపెనీ సరికొత్త అప్‌డేట్స్ చేసినట్టు తెలుస్తోంది. 

Apple 2024 iPad Pro: ఆపిల్ ఐ ప్యాడ్ ప్రో 2024లో ఆపిల్ కంపెనీ చేస్తున్న మార్పుల్లో  కీలకమైందిగా డిస్‌ప్లే, శక్తివంతమైన చిప్ అని చెప్పవచ్చు. ఈ రెండు ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

1 /5

ఆపిల్ కంపెనీ 2024లో ఎం3 ఆపిల్ సిలికాన్ చిప్‌సెట్ , ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు ఐప్యాడ్ ప్రో లైనప్ దింపేందుకు సిద్ధమౌతోంది. ఇందులో కొత్త మోడల్ 12.9 ఇంచెస్ వేరియంట్ స్థానంలో ఉండవచ్చు.

2 /5

ఆపిల్ 2024లో తన ఐప్యాడ్ ప్రో లైనప్ కోసం ఎం3 ఆపిల్ సిలికాన్ చిప్‌సెట్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే దింపవచ్చని తెలుస్తోంది. కొత్త మోడల్ 11 ఇంచెస్ , 13 ఇంచెస్‌లో రావచ్చని అంచనా. 

3 /5

కాలిఫోర్నియాలోని టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్..అప్‌కమింగ్ ఐప్యాడ్ ప్రో ద్వారా ట్యాబ్ మార్కెట్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అటు ఐప్యాడ్ ప్రోలో 2018 తరువాత ప్రోసెసింగ్ పవర్, డిస్‌ప్లే క్వాలిటీ, కెమేరా సామర్ధ్యంలో సాధారణ మార్పు మాత్రమే  కన్పించింది.

4 /5

ఆపిల్ తన అప్‌కమింగ్ ఆపిల్ సిలికాన్ చిప్, ఎం3ను ఐప్యాడ్ ప్రోలో లైనప్ చేయాలని భావిస్తోంది. J717, J718, J720,J721 కోడ్ నేమ్ కలిగి ఐప్యాడ్ ప్రో 2024లో లాంచ్ కానుంది. ఇందులో ప్రధానంగా ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చు.

5 /5

ఐ ప్యాడ్ ప్రోతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన మ్యాజిక్ కీబోర్డ్‌లో కూడా ఆపిల్ మార్పులు చేసింది. ఇందులో అతిపెద్ద ట్రాక్ ప్యాడ్ ఇంటిగ్రేట్ చేసింది కంపెనీ. ఇప్పుడున్న కాన్ఫిగరేషన్‌తో పోలిస్తే అత్యధిక శక్తివంతమైంది.