Top 5 Upcoming Movies: కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించనున్న అప్‌కమింగ్ 5 సినిమాలు ఇవే

Top 5 Upcoming Movies: పఠాన్, గదర్ 2, డ్రీమ్ గర్ల్ 2 సినిమాల విజయంతో బాలీవుడ్‌కు మంచి రోజులు వచ్చినట్టుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే అంతకు ముందు బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన పరిస్థితి.

Top 5 Upcoming Movies: ఈ క్రమంలో అటు త్వరలో విడుదల కానున్న ఈ 5 సినిమాలపైనే అందరి దృష్టీ నెలకొంది. ఇవి కచ్చితంగా బ్లాక్‌బస్టర్ సినిమాలు కావచ్చని అంచనా. ఏ సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుందనేదే అవసరం ఇప్పుడు. బ్లాక్‌బస్టర్ కావడం మాత్రం ఖాయం. ఆ సినిమాలేంటో చూద్దాం..

1 /5

టైగర్ 3 టైగర్ 3 కూడా త్వరలో విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావచ్చని తెలుస్తోంది

2 /5

పుష్ప 2 బాలీవుడ్ కాకుండా దక్షిణాది టాలీవుడ్ సినిమా పుష్ప దేశమంతా ఎంతటి సంచలనం కల్గించిందో..ఎలాంటి మేనియా సృష్టించిందో అందరికీ తెలుసు. కలెక్షన్లలో కూడా తగ్గేదే లే అని నిరూపించింది. ఇప్పుుడు పుష్ప 2పై అంతకుమించిన అంచనాలున్నాయి. కచ్చితంగా  పుష్ప 2 మరో బ్లాక్‌బస్టర్ కావచ్చని తెలుస్తోంది.

3 /5

జవాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. దేశమంతా ఇప్పుడీ సినిమావైపే చూస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లలో రికార్డు కలెక్షన్లు వచ్చేశాయి. కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ కావచ్చంటున్నారు.

4 /5

ఫుక్రే 3 పుక్రే, ఫుక్రే రిటర్న్స్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఎంతటి సంచలనం నమోదు చేశాయో అందరికీ తెలుసు. భారీగా కలెక్షన్లు సాధించిన సినిమాలివి. ఇప్పుడు ఫుక్రే 3 మరో బ్లాక్‌బస్టర్ హిట్ నమోదు చేసి సొంత రికార్డు బద్దలు గొడుతుందని అంచనా.

5 /5

ఫైటర్ హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేవలం ఫస్ట్‌లుక్ తప్ప మరే ఇతర వివరాలు ఈ సినిమా గురించి తెలియవు.