FD Interest Rate: ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ కావాలనుకుంటే మీ కోసం కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి. ఎఫ్డి అనేది అత్యంత సురక్షితమైంది. సరైన బ్యాంకులో డిపాజిట్ చేస్తే రిస్క్ లేకుండా రిటర్న్స్ కచ్చితంగా వస్తాయి. గత ఏడాది కాలంలో ఆర్బీఐ రెపో రోటు 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. చిన్న చిన్న బ్యాంకులు ఎఫ్డీలపై ఎంత వడ్డీ ఇస్తున్నాయో తెలుసుకుందాం..
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 నుంచి 8.50 శాతం వరకూ వడ్డి ఇస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకూ మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డిపై 8.5 శాతం వడ్డీ లభిస్తుంది
ఈఎస్ఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 10 ఏళ్ల ఎఫ్‌డిపై 8.50 శాతం వడ్డీ ఇస్తుంది. రెండేళ్ల కంటే ఎక్కువ మూడేళ్ల కంటే తక్కువ మెచ్యూరిటీ ఉన్న ఎఫ్డీపై 8.50 శాతం వడ్డీ ఉంటుంది. ఈ పథకం 14 ఏప్రిల్ 2023 నుంచి అమల్లోకి వచ్చింది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 7 రోజుల్నించి 10 ఏళ్ల వరకూ ఎఫ్డీలు అందిస్తోంది. 3 శాతం నుంచి 8.61 శాతం వరకూ వడ్డీ ఇస్తుంది. 750 రోజులు అంటే దాదాపు 2 ఏళ్ల ఎఫ్‌డిపై 8.61 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 751 రోజుల్నించి రెండున్నరేళ్ల ఎఫ్‌డీకు 8.15 శాతం వడ్డీ లభిస్తుంది. 28 అక్టోబర్, 2023 నుంచి అమల్లోకి వచ్చింది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 రోజుల్నించి 10 ఏళ్ల కాల పరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్లు అందిస్తోంది. కాల పరిమితిని బట్టి 4.50 శాతం నుంచి 9 శాతం వరకూ వడ్డి అందిస్తోంది. 1001 రోజులకు అయితే 9 శాతం వడ్డీ లభిస్తుంది. 1002 రోజుల్నించి 3 ఏళ్లకైతే 7.65 శాతం వడ్డీ ఇస్తుంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4 నుంచి 8.60 శాతం వరకూ వార్షిక వడ్డీ ఇస్తోంది. 2-3 ఏళ్ల కాలానికి 8.60 శాతం వడ్డీ ఇస్తుంది. 7 ఆగస్టు 2023 నుంచి అమల్లోకి వచ్చింది ఈ పథకం.