Rusted Taps: వాటర్ ట్యాప్ ఎంత ఖర్చు పెట్టిన అది వెంటనే తుప్పు పడుతుంటాయి. వీటిని వాడకుండా ఉంటే పూర్తిగా పనిచేయకుండా ఉంటాయి. అయితే వీటిని తిరిగి మెరిసేలా చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించడం వల్ల తుప్పు పట్టిన మీ ట్యాప్స్‌ను మళ్లీ కొత్త వాటిగా మార్చుకోవచ్చు.అంతేకాకుండా మరకలను కూడా తొలగించడంలో ఈ చిట్కాలు ఉపయోగపడుతాయి.
సాధరణంగా ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్ తుప్పు పడుతుంటాయి. తుప్పు పట్టిన తర్వాత అలానే వదిలేస్తాం. అయితే ఈ టిప్స్‌ను ట్రై చేయడం వల్ల తుప్పు పట్టిన ట్యాప్ మళ్లీ కొత్తగా కనిపిస్తుంది.
బేకింగ్ సోడాతో తుప్పు పట్టిన ట్యాప్‌ను శుభ్రం చేసుకోండి ఇలా. బేకింగ్ టీ స్పూన్ సున్నం కలిపి ట్యాప్‌కు ఈ మిశ్రమం పట్టించాలి. 6 నిమిషాలు అలాగే ఉంచండి. దీంతో తుప్పు పోవడమే కాకుండా ట్యాప్ కొత్తగా మెరుస్తుంది.
తుప్పు పట్టిన ట్యాప్‌ను శుభ్రం చేయడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్‌లో ట్యాప్‌ను ఉంచి శుభ్రం చేయడం వల్ల తుప్పు పోతుంది.
నిమ్మకాయ మరకలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. ముందుగా గ్లాస్ నీళు తీసుకొని వేడి చేయాలి. తరవాత నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో తుప్పుపట్టిన ట్యాప్ ను కొంత టైం వరకు కడగాలి. ఇలా చేయడం వల్ల ట్యాప్ క్లీన్ అవుతుంది.
వెనిగర్, బేకింగ్ సోడా వాడటం వల్ల తుప్పు పట్టిన ట్యాప్ తెల్లగా మారుతుంది.
టూత్ బ్రష్ , ఉప్పు, నిమ్మకాయ సహాయంలో తుప్పు పట్టిన ట్యాప్ సులభంగా శుభ్రం అవుతుంది.