WTC 2023-2025: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC 2023-2025) పట్టికలో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ దక్కించుకుంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన టీమిండియా రెండో ర్యాంకుకు పడిపోయింది. తాజాగా పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ గెలవడం ద్వారా ఆసీస్ నెంబర్ వన్ ర్యాంకు చేజిక్కించుకుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆసీస్ తొమ్మిది టెస్టులు ఆడిన ఆరు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో మొత్తం 61.11 శాతం విజయాలతో తొలి స్థానంలో నిలిచింది. భారత్ నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 54.16 శాతం నమోదు చేసి సెకండ్ ఫ్లేస్ లో కొనసాగింది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (50శాతం), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్ (50) కొనసాగుతున్నాయి.
టీమిండియా అగ్రస్థానానికి చేరుకోవాలంటే..
పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా అదే ఊపును వెస్టిండీస్‌పైన కొనసాగిస్తోంది. తాజాగా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను పది వికెట్ల తేడాతో (AUS vs WI) ఓడించింది. ట్రావిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానికి ఎగబాకింది. టీమిండియా మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవాలంటే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో రాణించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో అత్యధిక విజయాలు సాధిస్తే భారత్ తొలి స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ ఏడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో తొమ్మిది పాయింట్లు సాధించింది.
Also Read: NZ vs PAK: కివీస్ టీమ్ లో కరోనా కలకలం.. ఆ స్టార్ ఓపెనర్‌కు పాజిటివ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
WTC 2023-2025: ఆసీస్ దెబ్బకు నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా!