Top Bikes Under 2 Lakhs: గత కొద్దికాలంగా మార్కెట్‌లో విభిన్న రకాల టూ వీలర్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. అందులో మస్క్యులర్ స్టైల్ బైక్స్‌కు క్రేజ్ ఎక్కువగా కన్పిస్తోంది. 2 లక్షల రూపాయల్లోపు బడ్జెట్‌లో లభించే టాప్ 5 బైక్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, యమహా, బజాజ్ కంపెనీల బైక్స్ ఉన్నాయి.
Yamaha R 15S యమహా ఆర్ 15 ఎస్ ప్రారంభ ధర1.65 లక్షలు. ఇండియాలో 1 వేరియంట్ 2 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కూడా రెండువైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
TVS Ronin ఇది స్టైలిష్ అండ్ మస్క్యులర్‌లా ఉంటుంది. మోడర్న్ క్రూయిజర్ లుక్ కలిగి ఉంటుంది. ఇందులో 4 వేరియంట్లు 7 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 225.9 సీసీ, బీఎస్ 6 ఇంజన్ ఉంటుంది ఇది 20.1 బీహెచ్‌పి పవర్, 19.33 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్దుంది. డ్యూయల్ ఛానెల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర 1.49 లక్షల రూపాయలు
Bajaj NS 200 బజాజ్ ఎన్ఎస్ 200 స్టైలిష్ నేక్డ్ డిజైన్‌తో వస్తోంది. పల్సార్ ఎన్ఎస్ 200 లో 1999.5 సిసి, బీఎస్ 6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 24.13 బీహెచ్‌పి , 18.74 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్ ఉంటాయి. దాంతో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ బైక్ బరువు 159.5 కిలోలు. ఈ బైక్ దర 1.42 లక్షల రూపాయలు
Royal Enfield Hunter 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అనేది రోడ్‌స్టర్ బైక్ . ఇదులో 3 వేరియంట్లు, 10 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. హంటర్ 350 బీఎస్ 6 ఇంజన్‌తో వస్తోంది. 20.2 బీహెచ్‌పి పవర్, 27 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ అం్ రేర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉండటం ప్రత్యేకత. ఇందులో సింగిల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఉంది. ఈ బైక్ ధర 1.49 లక్షలు.
TVS Apache RTR 200 4 V టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధర 1.42 లక్షలు. ఇందులో 2 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 200 సిసి సింగిల్ సిలెండర్ బీఎస్ 6 ఇంజన్ ఉంటుంది. స్పోర్ట్ బైక్‌లా కన్పిస్తుంది. ఈ బైక్ ఇంజన్ 20.54 బీహెచ్‌పి పవర్, 17.25 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా రెండు వైపులు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.