Titanic 2 Ship: టైటానిక్..ఇప్పటి తరాలు చూడకపోయినా అందరికీ తెలిసిన పదం. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్లో రిట్జ్ హోటల్లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్ 2 నిర్మాణం వార్తల్లో నిలుస్తోంది.
క్లైవ్ పామర్ స్వతహాగా ఓ వ్యాపారవేత్త. ఓడలు తయారు చేసే బ్లూ స్టార్ లైన్ కంపెనీ యజమాని. 70 ఏళ్ల క్లైవ్ పామర్ ఆస్ట్రేలియా నుంచి ఎంపీగా ఉన్నారు. ఇటీవలే యునైటెడ్ ఆస్ట్రేలియా పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు.
డెల్టామెరీన్ వంటి కంపెనీలు చేసిన రీసెర్చ్ ప్రకారం 56 వేల టన్నుల టైటానిక్ 2 ఓట ఖర్చు దాదాపుగా 500 మిలియన్ యూఎస్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు ఉండవచ్చు.
టైటానిక్ 2 ప్రాజెక్టు ప్రారంభంలో పేమెంట్ కారణంగా 2015లో నిలిచిపోయింది. 2022 వరకూ అంతా సెట్ అవుతుందని 2018లో పామర్ చెప్పినా కార్యరూపం దాల్చలేదు. 2020 నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడించింది.
టైటానిక్ గత వైభవం మరోసారి చూసే అవకాశం ఎప్పుడు వస్తుందనే విషయంలో ఏ విధమైన క్లారిటీ లేదు. దశాబ్దం క్రితం టైటానిక్ 2 గురించి చెప్పిన క్లైవ్ పామర్ ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని రిపీట్ చేశాడు.
టైటానిక్ 2 సముద్రంలో తప్పకుండా తిరుగుతుందని అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ స్పష్టం చేశాడు. సిడ్నీలోని ఒపేరా హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో టైటానికి 2 గురించి ప్రస్తావించాడు. అంతేకాదు టైటానిక్ 2 డిజైన్ ఆవిష్కరించాడు.