రూ. 60 పెరిగిన సబ్సీడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర

రూ. 60 పెరిగిన సబ్సీడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర

Last Updated : Nov 1, 2018, 05:56 PM IST
రూ. 60 పెరిగిన సబ్సీడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధర

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అధికారులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం సబ్సీడీపై లభించే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2.94 పెరగగా సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 మేర పెరిగింది. ఈ పెరుగుదల అనంతరం సబ్సీడీపై లభించే సిలిండర్ ధర రూ.505.34కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడంతోపాటు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరీ బలహీనపడటం ధరల పెరుగుదలకు మరో కారణంగా ఐఓసీ వర్గాలు తెలిపాయి. 

పెరిగిన ఇంధనం ధరల ప్రభావం కాకుండా కేవలం జీఎస్టీ భారం మాత్రమే వినియోగదారులపై పడుతుందని, పెరిగిన ధరలను సబ్సీడీపై ప్రభుత్వమే భరిస్తుందని ఐఓసీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్‌లో రాయితీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాలో రూ.376.60 జమకాగా, నవంబర్‌లో రాయితీ రూ.433.66కు పెరుగనున్నట్టు అధికారులు చెప్పారు. జూన్ నుంచి వరుసగా ప్రతీ నెల సబ్సిడీ సిలిండర్ ధరలు పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో ఈ ఐదారు నెలల్లో కలిపి సబ్సీడీ సిలిండర్ ధర మొత్తం రూ.14.13 మేర పెరిగినట్టు తెలుస్తోంది.

Trending News