Pragya Jaiswal: స్టైలిష్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్.. అందానికే అందంలో కనిపిస్తున్న నటి

Pragya Stylish Pics:
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

  • Apr 01, 2024, 20:44 PM IST
1 /5

తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’ తో  సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

2 /5

అయితే ఈ హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది మాత్రం వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా. ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  

3 /5

కానీ ఆ తర్వాత వచ్చిన ఈ హీరోయిన్ సినిమాలు అన్ని డిజాస్టర్ అవ్వడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. మరలా ఈ మధ్య బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.

4 /5

ఈ హీరోయిన్ చివరిగా కనిపించిన చిత్రం సన్నాఫ్ ఇండియా కాగా.. తన తదుపరి తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

5 /5

ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్ స్టైలిష్ గ్రీన్ డ్రెస్ లో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.