Remove Election Ink: వేలికి పెట్టిన ఎన్నికల సిరాచుక్క పొవట్లేదా.?. డోంట్ వర్రీ ఈ టిప్స్ మీకోసమే..

Remove Vote ink From Nail: దేశంలో ఇప్పటిదాక నాలుగు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో యువత ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. 
 

  • May 13, 2024, 21:10 PM IST
1 /6

ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల జాతరగా కన్పించింది. ప్రజలంతా ఓటు హక్కును ఉపయోగించుకొవడానికి తమ గ్రామాలకు తరలి వెళ్లారు. బస్సులు, రైళ్లు, విమానంలో కూడా వెళ్లిపోయారు. ఎలాగైన ఓటువేయాలని యువత కదంతొక్కారు.

2 /6

ఇక పోలింగ్ రోజు ఉదయం నుంచి జనాలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సామాన్యులే కాకుండా.. రాజకీయనాయకులు, సెలబ్రీటీలు పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చారు.   

3 /6

ముఖ్యంగా ఎన్నికల అధికారులు ఓటు హక్కును వినియోగించుకొవడానికి వచ్చే వారికి చూపుడు వేలుకు తప్పనిసరిగా సిరా చుక్క వేస్తుంటారు. ఇది ప్రత్యేకంగా కెమికల్ తో తయారు చేస్తారు. ఇది కొన్నిరోజుల పాటు వేలిగోర్లకు అలానే ఉండిపోతుంది. 

4 /6

ఈ నేపథ్యంలో ఓటింగ్ ముగిశాక కొందరు తమ వేలికి ఉన్న సిరాచుక్కను వదిలించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే... నెయిల్ పాలీష్ రీమోవల్ జెల్ ను ఉపయోగించి సిరా చుక్క పోయేలా చేసుకొవచ్చు.  

5 /6

మార్కెట్ లో దొరికే యాంటి బ్యాక్టిరియల్ లిక్విడ్స్ వల్ల కూడా ఈజీగా సిరా మరకను పొగొట్టుకొవచ్చు.హెయిర్ రీమోవల్ క్రీమ్స్, సబ్బులు, డిష్ వాష్‌ బార్ సర్ఫ్ లతో గట్టిగా క్లీన్ చేస్తే ఈ సిరాచుక్క అనేది మాయమైపోతుంది.  

6 /6

వాషింగ్ లిక్విడ్, కొన్నిరకాలు కఠిన మైన డిటర్టంట్ లను ఉపయోంచి సిరాచుక్క పోయేలా చేసుకొవచ్చని నిపుణులు చెబుతున్నారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)