Shriya Saran: వెకేషన్ ఎంజాయ్ చేస్తూ శ్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Shriya Saran  Hot Photos: తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రియ. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ నటి.. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను అలరిస్తోంది.

1 /5

ఒక హిందీ ఆల్బమ్ తో తన కెరియర్ మొదలుపెట్టిన శ్రియ.. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. వెంటనే నాగార్జునతో సంతోషం సినిమాలో ఛాన్స్ అందుకుంది.

2 /5

దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సంతోషం చిత్రం శ్రియ కెరియర్ ని మార్చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకొని శ్రియకి.. వరస సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వే నువ్వే చిత్రం కూడా.‌. ఈమెకు మంచి విజయం అందించింది.

3 /5

ఆ తరువాత చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బాలు, నా అల్లుడు.. అంటూ వరసగా స్టార్.. హీరోలతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది శ్రియ. మరో పక్క.. చిన్న హీరోలతో సైతం.. సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగించింది.

4 /5

తెలుగుతోపాటు తమిళంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న శ్రియ.‌ గత కొద్ది సంవత్సరాల క్రితం.. హిందీలో దృశ్యం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం మూడో భాగంతో.. హిందీ  ప్రేక్షకులను త్వరలోనే పలకరించనుంది..

5 /5

ఈ క్రమంలో ఈ హీరోయిన్ మళ్ళీ తెలుగు సినిమాలలో.. ఎప్పుడు కనిపిస్తుందా..అని ఎదురు చూస్తున్నారు..ఆమె అభిమానులు. ఇదిలా ఉండగా ప్రస్తుతం.‌ శ్రియా షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ.. ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.