IBPS PO Recruitment notification 2024: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎలా అప్లై చేసుకోవాలి? అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం.
బ్యాంక్ జాబ్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ ఐబీపీఎస్ పీఓకు అప్లై చేసుకునే సమయం ఆసన్నమైంది. అయితే, ఓబీసీ, రిజర్వేషన్ లేని, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవారు రూ. 850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ చెందినవారు రూ. 175 చెల్లించాలి.
అయితే, ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇది అక్టోబర్ 19,20 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ కటాఫ్ మార్కుల తర్వాత మెయిన్ ఎగ్జామ్‌కు క్వాలిఫై అవుతారు. ఈ మెయిన్స్ పరీక్ష నవంబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు.
అభ్యర్థి విజయవంతంగా ఈ రెండు దశల్లో ఉత్తిర్ణత సాధిస్తే చివరగా పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. అన్ని దశలు పూర్తయిన తర్వాత అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తుండాలి.
ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ 2024 దరఖాస్తు చేసుకునే విధానం.. అధికారిక వెబ్‌సైట్ ఐబీపీఎస్- www.IBPS.In ఓపెన్ చేయాలి. ఆ తర్వాత 'IBPS PO Apply Online' పై క్లిక్ చేయాలి 'New Registration' ఎంపిక చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీ వివరాలను నమోదు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్, పాస్వర్డ్ వివరాలను నమోదు చేయాలి.
అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. మీ సంతకం, ఫోటో, ఎడమ బొటనవేలు ముద్రతోపాటు మీరు రాసిన డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపాలి. చివరగా సబ్మిట్ బట్టన్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తు రుసుము కూడా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఫారమ్ ప్రింట్ అవుట్ కూడా తీసిపెట్టుకోవాలి.