Mrunal Thakur: నేను మంచంపైన పడుకోవడం వల్ల.. నష్టపోయే వాళ్ళు ఎవరూ లేరు.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..!

Mrunal Thakur Interview: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను.. మంత్రముగ్ధుల్ని చేసిన మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న సినిమాతో.. మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్  ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి అని.. మనకి ఏదైనా కష్టం వచ్చి మనం మంచం మీదే ఉండిపోయినా.. దానివల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పుకొచ్చింది ఈ భామ.

1 /6

మరాఠీ, హిందీలలో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ.. హాయ్ నాన్న సినిమాతో మరొక హిట్ అందుకుని.. నిజంగా మన తెలుగు అమ్మాయేనా అన్నంతగా ఫాన్స్ ను ఏర్పరచుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్ ఠాకూర్ జీవితంలో తను ఫాలో అయ్యే కొన్ని మంచి ఫిలాసఫీల గురించి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

2 /6

మనకి కష్టంగా ఉండి రోజంతా మంచం పైనే పడుకోనుండిపోయినంత మాత్రాన ఎవరు నష్టపోరు అని.. కానీ ఏ రోజైతే మనం లేచి బయటకు వెళ్ళాలో ఆరోజు మనం మళ్లీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ క్రమంలో జీవితంలో తను ఫాలో అయ్యే ఫిలాసఫీల గురించి చెబుతోంది మృణాల్ ఠాకూర్.

3 /6

"ఒకరోజు నేనున్నాను నేను అద్దంలో చూసుకుంటూ ఒక ప్రశ్న అడిగాను. మృణాల్ ఇవాళ నీకు డల్ గా ఉంది.. నువ్వు వెళ్లి మంచం మీద పడుకో. రెండో రోజు ఉదయాన్నే లేచావు.. మళ్ళీ అలానే ఉంది.. మళ్లీ వెళ్లి పడుకో. అలానే మూడవ రోజు, నాలుగో రోజు, ఒక వారం, ఒక నెల.. మంచం మీద పడుకొని ఉండు. దానివల్ల ఎవరైనా ఏమైనా నష్టపోయారా? లేదు. కానీ మళ్ళీ లేచిన రోజు మనం జీరో నుంచి మొదలు పెట్టాలి" అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది మృణాల్. 

4 /6

"మా నాన్న నాతో ఎప్పుడూ అంటూ ఉంటారు. ఈ భూగ్రహం మీద పుట్టిన అందరూ.. నిన్ను ఇష్టపడాలని లేదు. నువ్వు కూడా ఎవరినో ఇంప్రెస్ చేయాలని అనుకుంటూ.. ఎక్స్ట్రాగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు నేనంటే ఇష్టం లేదా? ఇట్స్ ఓకే. మీకు నేనంటే ఇష్టమా.. గ్రేట్. మీరు నా స్థానంలో ఉంటే నా కష్టాలు మీకు అర్థం అవుతాయి. అలానే నేను మీ స్థానంలో ఉంటే.. మీ కష్టాల గురించి నాకు తెలుస్తుంది" అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. 

5 /6

ఈ నేపథ్యంలో సినిమాలతో మాత్రమే కాక తన జీవిత ఫిలాసఫీలతో కూడా మృణాల్ ఠాకూర్.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలపరంగా చూస్తే మృణాల్ ఆఖరిసారిగా ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో చాలా చిన్న పాత్రలో కనిపించింది.   

6 /6

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో.. చాలానే ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి కానీ.. తెలుగు నుంచి మాత్రం ఏమి లేవు. పూజా మేరీ జాన్, హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2 వంటి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్.. త్వరలోనే టాలీవుడ్ లో కూడా కనిపిస్తే బాగుంటుంది అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.