Tirumala Sanivaralu 2024: మొదలైన తిరువళ శనివారాలు.. ఈ నెలలో ఇలా చేస్తే మీరు కుబేరులవ్వడం ఖాయం..!

Tirumala Sanivaralu: డబ్బు ఇదః జగత్ అన్నారు.. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు.. అయితే డబ్బు సంపాదించడానికి కష్టపడితే మాత్రమే సరిపోదు.. దైవ బలం కూడా తోడు కావాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఏడాదిలో ప్రత్యేకించి కొన్ని నెలల్లో ఆయా నెలకు సంబంధించిన స్వామి వారికి లేదా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కుబేరులవడం ఖాయమని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరువళ శనివారాల కోసం కూడా భక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు. మరి ఈ తిరువళ శనివారాలు ఎప్పుడు మొదలవుతాయి..? ఏయే వారాలలో పూజలు చేసుకోవచ్చు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

1 /5

ప్రజలు,  భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న తిరువళ శనివారాలు వచ్చేసాయి. ఈ తిరువళ శనివారాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి అనే విషయానికి వస్తే.. 2024 సెప్టెంబర్ 17వ తేదీన మంగళవారం ఉదయం 10:55 నిమిషాలకు ఈ తిరవళ శనివారాలు ప్రారంభం అవుతాయి.

2 /5

2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మొదటివారం, 2024 సెప్టెంబర్ 28వ తేదీ శనివారం రెండవ వారం, 2024 అక్టోబర్ 5వ తేదీ శనివారం మూడవ వారం, 2024 అక్టోబర్ 12వ తేదీ శనివారం నాలుగో వారం ఇలా ఈ సంవత్సరం నాలుగు శనివారాలు వచ్చాయి. ఈ నాలుగు వారాలలో మీరు పూజ చేసుకోవచ్చు.

3 /5

అయితే శనివారాలు పూజ చేయడం కుదరలేదు అన్నవారు ఈ నెలలో ఎప్పుడైనా సరే పూజలు నిర్వహించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. అత్యంత భక్తి శ్రద్దలతో స్వామివారికి ఈ పూజలు నిర్వహించడం వల్ల ధన ప్రాప్తి లభిస్తుందని , లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.   

4 /5

మీరు కూడా కష్టపడుతున్నప్పటికీ, ఫలితం లభించక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఆర్థిక సమస్యలు తీరిపోయి ఆర్థికంగా బలంగా తయారవ్వాలనుకున్నవారు అలాగే కుబేరులు అవ్వాలనుకునే వారు కూడా ఈ శనివారాలలో స్వామివారికి పూజ నిర్వహిస్తే ఖచ్చితంగా కుబేరులు అవుతారని పండితులు చెబుతున్నారు.  

5 /5

ఇకపోతే ప్రతి శనివారం సుచీ శుభ్రత పాటించి , ఇంట్లో స్వామివారికి పూజ చేసి,  గుడికి వెళ్లి గుడి చుట్టూ 11 ప్రదక్షణలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. ఇలా భక్తిశ్రద్ధలతో నియమాలతో  ప్రతి శని వారం పూజ చేస్తే స్వామివారి కటాక్షం మనపై కలిగి కుబేరుల అవడం ఖాయం అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.