Dana Cyclone: దూసుకొస్తున్న 'దానా'.. 5 రాష్ట్రాలకు రెడ్‌ అలెర్ట్‌, 56 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు..

Dana Cyclone Alert: దానా తుఫాను ఇప్పటికే ఒడిశా తీరప్రాంతానికి తాకింది. ప్రజలను సురక్షిత ప్రాంతాకు తరలించారు. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ 5 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫానుగా మారింది. దీంతో తీరప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్ల మేర గాలులు వీయనున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుగా వేసిన అంచనా ప్రకారం ఈరోజు అక్టోబర్‌ 24వ తేదీ రాత్రి వరకు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.
 

1 /7

దానా తుఫాను తీవ్రరూపంలో ఒడిశాలోని దాదాపు 15 జిల్లాల్లో ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.   

2 /7

పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ తుఫాను ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే 56 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. బోట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచారు.  

3 /7

దానా తుఫాను వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందల్లో రైళ్లు, విమానాలను సైతం రద్దు చేశారు. 'దానా' ఈసారి ఖాతర్‌ ప్రభుత్వం ఈ పేరును ఎంచుకుంది. దీని అర్థం దాతృత్వం అని అర్థం.  

4 /7

మత్స్యకారులను కూడా వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.  15 జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఒడిశా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగావ ఆరు 288 రెస్క్యూ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది.  

5 /7

మత్స్యకారులను కూడా వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.  15 జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఒడిశా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగావ ఆరు 288 రెస్క్యూ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది.  

6 /7

ఈనెల 24, 25 రెండు రోజులపాటు నందన్‌కనాన్ జూ, స్టేట్‌ బొటానికల్‌ గార్డెన్‌ కూడా బంద్‌ ఉండనున్నాయి. కోల్‌కతాలో ఇప్పటికే 190 లోకల్‌ ట్రైన్స్‌, 15 గంటలపాటు విమాన సేవలను రద్దు చేసింది.  

7 /7

భారత రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా బుధవారం దానా తుఫాను గురించిన అత్యవసర  సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సీనియర్‌ రైల్వే అధికారులతో రివ్యూ చేసి రైలు సేవలను తగ్గించారు.