Fake 500 Rupee Note: ప్రధాని నరేంద్ర మోదీ రెండవ సారి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2016 నవంబర్ నెలలో పెద్ద నోట్లను రద్దు చేసిన కోట్లు కోట్లు బ్లాక్ దందాలను చేసేవారికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే భారత్‌లో పూర్తిగా రూ. 500, రూ. 1000 నోట్లు చలామణీ రద్దైంది. ఆ తర్వాత కేంద్ర రూ.2000 నోట్లు అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే అప్పటి నుంచి ప్రత్యేకమైన కొత్త డిజైన్‌తో రూ.5 వందల నోట్లు కూడా వచ్చాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం గతంలో విడుదల ప్రవేశపెట్టిన రూ.2 వేల నోట్లను రద్దు చేసింది. అయితే ఇప్పటికీ ఈ నోట్లు చాలా మంది వ్యాపారాలు RBI బ్యాంకుకు సమర్పిస్తున్నారు. అయితే రెండు వేల నోట్ల ఉపసంహరణ జరిగిన తర్వాత రూ.5 వందల నోట్ల నకిలీ భారీగా పెరిగింది.
ఇప్పటికే రూ. 500 నోట్ల నకిలీ దాదాపు 317 శాతం వరకు పెరిగిందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెళ్లడించింది. 2019 సంవత్సరంలో నకిలీ నోట్లు 21,865 మిలియన్లుగా ఉండేదట.. అయితే ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 91,110 మిలియన్ల చురుకుంది.
ఈ నకిలీ నోట్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 15 శాతం వరకు పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో టోటల్‌గా ఈ నోట్ల నకిలీ 317 శాతం పెరిగిందని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా కొవిడ్ సమయంలో దొంగ నోట్టు ఎక్కువగా చలామణీ అయినట్లు కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ఏకంగా ఏకంగా 79,669 మిలియన్లకు చేరింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ దొంగ నోట్లను గుర్తించలేకపోతున్నారు.
ఈ రూ.500 నోటు నకిలీదో, అసలైనదో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి నోటుపై నిలువులో ఒక పెద్ద గీత ఉంటుంది. ఈ గీత ఒరిజినల్ నోటుపై ఆకు పచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇది నకిలీ నోటులో మాత్రం.. దానిని వంచిన తర్వాత ముదురు రంగులోకి మారుతుంది.
చాలా మంది గమనించి ఉండరు.. ప్రతి నోటుపై కుడి, ఎడమ వైపున కాస్త ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే అందులో ప్రత్యేకమైన రూ.500 అని వాటర్ మార్క్ కూడా ఉంటుంది. కొన్ని నకిలీ నోట్లపై ఇవి ఉండవు..