Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి ఎప్పుడు..?.. దీని విశిష్టత..ఈ రోజున ఏంచేయాలంటే..?

Mokshada Ekadashi Vratam: ప్రస్తుతం మార్గశిరం మాసం స్టార్ట్ అయ్యింది. ఈ మాసంలో ఎక్కువగా విష్ణువును ఆరాధిస్తుంటారు. అదే విధంగా ప్రస్తుతం డిసెంబరు 11న మోక్షద ఏకాదశి  వస్తుంది. 

1 /6

సాధారణంగా మార్గశిర మాసం కూడా విష్ణుదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం అంట. అదే విధంగా ఏకాదశి తిథి అనేది అత్యంత పవిత్రమైనదిగా చెప్తుంటారు. ఈరోజు ఏపనిచేసిన కూడా అది మంచి ఫలితాలను ఇస్తుందంట.

2 /6

డిసెంబరు 11న మోక్షద ఏకాదశి వస్తుంది. ఈ రోజున సూర్యోదయం తెల్లవారు జామున 3 గంట నుంచి.. రాత్రి వరకు ఏకాదశి మూహుర్తం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే.. ఈరోజున సూర్యోదయంకి ముందే నిద్రలేవాలంట.

3 /6

అదే విధంగా శుభ్రంగా తలంటు స్నానంచేసి ఆతర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. విష్ణుసహాస్ర నామపారాయణ, విష్ణుదేవుడి అష్టోత్తర నామావాళి చదవాలని పండితులు చెబుతున్నారు.

4 /6

ముఖ్యంగా .. మోక్షద ఏకాదశి అనేది జీవులకు మంచి ఉత్తర లోకాలను ప్రసాదించేదిగా ఉపకరిస్తుందంట. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్దక్యం అనే దశలు ఉంటాయి. అయితే.. అంతిమ దశలో ఉన్నవారికి శీఘ్రంగా శ్రీమహ విష్ణువు అనుగ్రహాం కల్గుతుందంట.  

5 /6

ఈరోజున విష్ణుదేవుడ్ని గులాబీ పువ్వులు, తులసీ మాలలతో అలంకరించాలి. అదే విధంగా.. వివిధ రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతుంటారు. కొంత మంది ఈరోజున ఉపవాసాలు సైతం చేస్తుంటారు.  

6 /6

మోక్షద ఏకాదశి రోజున.. ఆకలితో ఉన్న అనార్థులకు, రోడ్డు మీద సంచరించే జీవజాతులకు ఏదైన తినేందుకు పెట్టాలంట. ఇలా పెడితే.. మనం తెలిసి లేదా తెలియక చేసుకున్న పాప కర్మలన్ని దూరమౌతాయంట. అదే విధంగా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు.