ICMR: భారత్‌కు పిడుగులాంటి వార్త.. ఒక్కరు కాదు ఆ ఇద్దరికీ చైనా వైరస్సే.. ఐసీఎంఆర్‌ అధికారిక ప్రకటన..!

ICMR Official Declaration On China Virus:  భారత్‌కు పిడుగులాంటి వార్త.. ఒక్కరు కాదు ఇద్దరికి చైనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని  (ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఐసీఎంఆర్‌ అధికారిక ప్రకటన చేసింది. నేడు ఉదయం కర్నాటకలోని ఓ 8 నెలల చిన్నారికి చైనా వైరస్‌ లక్షణాలు పాజిటివ్‌ వచ్చింద అని అనుమానాలు బయటకు వచ్చాయి.
 

1 /7

అనుకున్నదే జరిగింది.. అందరూ భయపడుతున్నట్లు భారత్‌లోకి చైనా వైరస్‌ ఎంట్రీ ఇచ్చింది. ఒక్కరు కాదు ఇద్దరు చిన్నారులకు సోకింది. చైనా వైరస్‌ హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ (HMPV) సోకింది.  

2 /7

ఇవి అనుమానాలు కాదు, పుకార్లు కాదు ఏకంగా ఐసీఎంఆర్‌ ఈ చైనా వైరస్‌ పాజిటివ్‌ వార్తను అధికారికంగా ధ్రువీకరించింది. కానీ, ఆ ఇద్దరూ ఏ అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదు. కానీ, వీరికి అనుహ్యంగా వైరస్‌ సోకింది.   

3 /7

ఈ ఉదంతం మరింత భయాందోళనలను పెంచింది. ఏ ప్రయాణం చేసిన హిస్టరీ కూడా లేకుండా హెచ్‌ఎంపీవీ వైరస్‌ పాజిటివ్‌ రావడం ఏంటని అంత ఆశ్చర్యపోతున్నారు. ఇది భారత్‌ను మరింత కలవరపెడుతుంది.  

4 /7

హెచ్‌ఎంపీవీ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు ఇప్పటికే వ్యాప్తి చెందిందని అందుకే చాలామంది రొంప సమస్యలతో ఈసారి ఎక్కువగా బాధపడుతున్నారని చాలా దేశాల్లో హెచ్‌ఎంపీవీ లక్షణాలు కనిపిస్తున్నాయట. ఐసీఎంఆర్‌ ఐడీఎస్‌పీ నెట్‌వర్క్‌ ప్రకారం చాలామందికి రెస్పరేటరీ జబ్బులు విపరీతంగా పెరిగాయి.  

5 /7

కర్నాటకలోని బాప్తిస్ట్‌ ఆసుపత్రిలో ఓ మూడు నెలల పాపకు హెచ్‌ఎంపీవీ లక్షణాలు కనిపించాయి. మొదట బ్రోన్క్‌నిమోనియాతో బాధపడిన పాపకు ఈ వైరస్‌ లక్షణాలు ధ్రువీకరించారు.  

6 /7

 ఇక 8 నెలల మరోపాపకు కూడా హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ ఈ నెల 3వ తేదీన వచ్చింది. ఈ పాప కూడా మొదట బ్రోన్కనిమోనియాతోనే బాధపడింది. ఆ తర్వాత హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది  

7 /7

కానీ, ఈ ఇద్దరు పిల్లలు అంతర్జాతీయంగా ఏ ప్రయాణం చేయలదు. అలాంటివానిపి కలవలేదు. యూనియన్‌ హెల్త్‌ మినిస్ట్రీ దీనిపై అన్ని విధాలుగా ఆరా తీస్తుంది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తిని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూనే ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటి కప్పుడు చైనాలోని పరిస్థితులను వెల్లడిస్తునే ఉంది.