Prabhas marriage: రెబల్ స్టార్ ప్రభాస్ తో పెళ్లికి సిద్ధమైన తెలుగు బ్యూటీ..!

Prabhas marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్..  ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇట్టే పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవుతుంది.  ముఖ్యంగా ఆయన పెళ్లి గురించి వచ్చే వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. 

1 /5

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే.. వెంటనే వినిపించే పేరు ప్రభాస్. అందుకే ఈ హీరో పెళ్లి విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎంతోమంది అమ్మాయిలు కూడా.. ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అందు కామెంట్లు పెడుతూ ఉంటారు. వాళ్లలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉండడం గమనర్హం.  

2 /5

ఇదిలా ఉండగా సినిమాలపరంగా ఉన్నత స్థాయిలో నిలిచిన ఈ హీరో.. వ్యక్తిగతంగా మాత్రం పెళ్లి వల్ల.. ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచిన హీరోల జాబితాలో ప్రభాస్ కూడా ఒకరిగా పేరు దక్కించుకున్నారు. ఏకంగా 40 సంవత్సరాలు పూర్తయిన.. కానీ ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి గురించి ఏ అధికారిక వార్త కూడా తెరపైకి రావడం లేదు. 

3 /5

ఇదిలా ఉండగా తాజగా ఒక బిగ్ బాస్ బ్యూటీ మాత్రం నేను ప్రభాస్ తో పెళ్లికి సిద్ధమే అంటూ కామెంట్లు చేసింది. ఆమె ఎవరో కాదు దివి. తన అంద చందాలతో సోషల్ మీడియాలో అగ్గిరాజేసే ఈ ముద్దుగుమ్మ, ఎప్పటికప్పుడు తన అందచందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ తో పెళ్లిపై కామెంట్లు చేసింది.  

4 /5

దివి ఆధ్యా గా పేరు దక్కించుకున్న ఈమె, బిగ్ బాస్ తో పాటు పలు సినిమాలలో కూడా నటించింది. ఇకపోతే చేసింది తక్కువ సినిమాలే అయినా వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగమైన దివి నటుడు ప్రభాస్ గురించి  కామెంట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  “ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని చాలామంది చెప్పడం నేను విన్నాను”.    

5 /5

“అతను ఇంటికి వచ్చిన వారికి కడుపు నింపుతాడని కూడా విన్నాను. అందుకే నేను ఆయన్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నాను. ఆయనను నేను ఇష్టపడుతున్నాను. ఆయనతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను. కాఫీ తాగుతూ గడపాలనుకుంటున్నాను. అంతేకాదు ఆయనను నేను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను,” అంటూ ఓపెన్ గా చెప్పేసింది దివి. ప్రస్తుతం దివి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయాలు ప్రభాస్ వరకు వెళ్తే ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.