Government Job Recruitment 2025: రూ.67 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. వారికి ఇది బెస్ట్‌ ఛాన్స్‌..

Government Job Recruitment 2025: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ నుంచి నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే అందులో ఉన్న 73 ఖాళీ పోస్టులను భార్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Government Job Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కార్‌ సంక్రాంతికి ముందే గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్‌ నోటిఫికేష్‌ను విడుదల చేసింది. వివిధ భాగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పోస్టుల్లో భాగంగా ముందుగా  జనరల్ మెడిసిన్, ఆప్తాల్మాలజీతో పాటు జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ విభాగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను మూడు సంవత్సరాలకు గాను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెళ్లడించారు. 
 

1 /5

ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, అర్హత కలిగిన వారు నేరుగా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సంప్రదించాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో తెలిపారు.     

2 /5

అలాగే ఈ ఇంటర్వ్యూ కి వెళ్లే వారు తప్పకుండా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అందించే  గూగుల్ ఫారం ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో భాగంగా సీనియర్ రెసిడెంట్‌తో పాటు సీనియర్ డెమోన్స్ట్రేటర్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.    

3 /5

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం ఖాళీల సంఖ్య 73 కాగా.. వీటన్నింటిని త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నోటిఫికేషన్‌లో విద్యార్హతలను కూడా పేర్కొంది. అంతేకాకుండా గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయస్సు గల వారిని మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు.    

4 /5

ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం వివరాల్లోకి వెళితే.. ప్రతి నెల రూ.67,700తో పాటు ప్రత్యేకమైన అలవెన్సులు ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అలాగే నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.56 వేలకు పైగా సాలరీని అందించబోతున్నట్లు తెలిపారు.    

5 /5

అలాగే ఈ నోటిఫికేషన్‌లో వయస్సుకు సంబంధించిన సడలింపులను కూడా పేర్కొంది. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల పాటు సడలింపు ఉండబోతోంది. అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు సడలింపు ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. PWD సంబంధించిన వారికి 10 ఏళ్లు ఉండబోతున్నట్లు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా వెల్లడించారు.