Virat Kohli: దిగ్గజాలకే అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ.. గణాంకాలే సాక్ష్యాలు

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ ఇటీవల చేరుకున్న 12000 పరుగుల మైలురాయి అందుకు ఓ నిదర్శనమని భావించవచ్చు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ల వ్యూహాలను ఛేదిస్తూ, ఛేజింగ్‌లో కింగ్‌గా, భారత పరుగుల యంత్రంగా ఎదిగాడు విరాట్ కోహ్లీ. అతడి రికార్డులు గమనిస్తే దిగ్గజాలకు అందనంత ఎత్తుకు కోహ్లీ చేరుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.  (Image Credits: Twitter/@BCCI)

  • Dec 04, 2020, 09:40 AM IST
1 /6

అంతర్జాతీయ క్రికెట్‌లో 22000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ కేవలం 462 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఇదే ఫీట్ చేరడానికి సచిన్‌కు 493 ఇన్నింగ్స్‌లు, బ్రియాన్ లారాకు 511 ఇన్నింగ్స్‌లు, రికీ పాంటింగ్‌క 514 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. ఏ పరంగా చూసిన విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాళ్ల కంటే మెరుగైన బ్యాటింగ్ సగటుతో పాటు ఛేజింగ్‌లో అద్భుత రికార్డులు కలిగి ఉన్నాడు. కెప్టెన్‌గానూ అత్యధిక సెంచరీల రికార్డును సైతం విరాట్ తన పేరిట లిఖించుకున్నాడు.

2 /6

విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో ఇటీవల 12,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాయి. ఈ ఘనత సాధించడానికి కోహ్లీకి అవసరమైన ఇన్నింగ్స్‌లు కేవలం 242. ఇదే విషయానికొస్తే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్యలకు ఎన్ని ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయో చూడండి.

3 /6

సచిన్ 300 ఇన్నింగ్స్‌లలో 12000 వన్డే పరుగులు పూర్తిచేశాడు. అయితే అత్యంత వేగవంతంగా 12వేల వన్డే పరుగుల సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

4 /6

ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా ఉండే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 314 ఇన్నింగ్స్‌లలో 12000 వన్డే పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 72 తక్కువ ఇన్నింగ్స్‌లకే ఈ ఫీట్ సాధించాడు.

5 /6

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 336 వన్డే ఇన్నింగ్స్‌ల‌లో 12000 వన్డే రన్స్ పూర్తి చేశాడు. సంగక్కర కన్నా కోహ్లీ మరో 92 తక్కువ ఇన్నింగ్స్‌లకు ఈ ఫీట్ చేరుకున్నాడు. త్వరలోనే సంగక్కర వన్డే పరుగుల రికార్డును అధిగమిస్తాడు. Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా!

6 /6

శ్రీలం డాషింగ్ బ్యాట్స్‌మన్, మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 379 ఇన్నింగ్స్‌లలో 12000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. టాప్ 5 ఆటగాడిగా నిలిచాడు జయసూర్య. త్వరలోనే జయసూర్య వన్డే పరుగులను కోహ్లీ అధిగమించనున్నాడు. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!