/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Amaravati lands scam: అమరావతి భూముల కుంభకోణం కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఏపీ సీఐడీ విచారణలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. రెవిన్యూ రికార్డుల మాయంపై స్పష్టత వచ్చింది. కీలకమైన వ్యక్తి సాక్షిగా మారారు.

ఏపీ రాజధాని అమరావతి భూముల కుంభకోణం (Amaravati Lands Scam) కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఏపీ సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న చెరుకూరి శ్రీధర్ సాక్షిగా మారుతుండటంతో వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ రికార్డుల మాయంపై వివరణ ఇచ్చారు శ్రీధర్. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..2015లో ల్యాండ్ పూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్ నెలలో తుళ్లూరు మండలం రెవిన్యూ రికార్డుల్ని రహస్యంగా తెప్పించుకున్నారు. ఒరిజినల్స్ తిరిగి తుళ్లూరు ఎమ్మార్వోకు ఇవ్వాల్సి ఉన్నా..గుంటూరు కలెక్టరేట్‌లోనే ఉంచేశారు. ఆ తరువాత ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని(Ap CRDA Act) అమల్లోకి తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వం రాజధాని నగర పరిధి నిర్ణయం కోసం సీఆర్డీఏ కమీషనర్ శ్రీకాంత్, గుంటూరు కలెక్టర్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి సమావేశం నిర్వహించారు.

ఇక 2015 జనవరి నెలలో భూసేకరణ కోసం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మాజీ మంత్రి నారాయణ(Ex minister Narayana) పర్యవేక్షణలో అసైన్డ్ భూముల సేకరణకై జీవో నెంబర్ 41 తీసుకొచ్చారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ (Assigned land Act) 1977కు విరుద్ధంగా ఉన్న అంశాల్ని అప్పటి మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా..ఆయన పట్టించుకోలేదు. జీవో జారీ చేయడానికి ముందే కొన్ని ప్రతిపాదనలు, చట్ట విరుద్ధంగా ఉన్నాయని చెప్పగా..మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రం నిర్ణయాల్ని అమలు చేస్తారని మంత్రి చెప్పినట్టు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే భూముల వ్యవహారం జరిగింది. చెరుకూరి శ్రీధర్ కీలక విషయాలు వెల్లడించడంతో ఇప్పుడు మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

Also read: AP Government: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలపై హై పవర్ కమిటీ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Cherukuri sridhar become key witness in amaravati lands scam, ex minister narayana in trouble
News Source: 
Home Title: 

Amaravati lands scam: అమరావతి భూ కుంభకోణంలో కీలక సాక్షి, మాజీ మంత్రి నారాయణ చుట్టూ

Amaravati lands scam: అమరావతి భూ కుంభకోణంలో కీలక సాక్షి, మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు
Caption: 
Amaravati land scam ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Amaravati lands scam: అమరావతి భూ కుంభకోణంలో కీలక సాక్షి, మాజీ మంత్రి నారాయణ చుట్టూ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, July 4, 2021 - 17:11
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
60
Is Breaking News: 
No