Ind vs NZ Match Highlights: టీ20 ప్రపంచకప్ 2021లో ఇండియాకు వరుసగా రెండవ పరాజయం ఎదురైంది. పాకిస్తాన్‌తో ఓటమి అనంతరం గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాను న్యూజిలాండ్ స్పిన్నర్లు నడ్డి విరిచారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంలో కివీస్ ఎటాక్‌కు ఇండియా విలవిల్లాడింది.

ముఖ్యంగా న్యూజిలాండ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్లు, అద్భుత ఫీల్డింగ్ ముందు ఇండియా చేతులెత్తేసింది. 7 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగుల అతి తక్కువ టార్గెట్ ఇవ్వగలిగింది న్యూజిలాండ్‌కు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు చూద్దాం.
స్కోర్ తక్కువగా ఉండటంతో హార్దిక్ పాండ్యా కొన్ని బిగ్ షాట్స్ చేసినా..ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో అవుటైపోయాడు. ఆ తరువాత బరిలో దిగిన శార్దూల్ థాకూర్ కూడా అవుటయ్యాడు.
అతి తక్కువగా ఉన్న రన్‌రేట్‌ను నెమ్మదిగా పెంచేందుకు రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాలు ప్రయత్నించారు. ఈలోగా ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఇక టీమ్ ఇండియాను వెంటాడుతున్న దురదృష్టం మరోసారి తట్టింది. డ్రింక్ బ్రేక్ అనంతరం వేసిన తొలి బాల్‌కు విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ఫలితంగా 10.1 ఓవర్లకు ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేయగలిగింది.
తొలి ఆరు ఓవర్లకు ఇండియా 2 వికెట్లు కోల్పోయి 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. లాంగ్ఆఫ్లో షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ కూడా మరో రెండు ఓవర్లయ్యే సరికి అవుటయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు ముందు నుంచీ ఆక్రమణ ప్రారంభించింది. ఇషన్ కిషన్ కేవలం 8 పరుగులు చేసి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత సౌథీ మరో ఇండియన్ ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ తీశాడు.