Amy Jackson dating famous actor: బ్రిటీష్ నటి అమీ జాక్సన్ (Amy Jackson) 'మద్రాస పట్టణం' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరో ఆర్యతో జతకట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించటంతో.. వరుస ఆఫర్ల క్యూ కట్టాయి.
ఆ తర్వాత ఆమె ధనుష్‌తో 'తంగమగన్', దళపతి విజయ్ 'తేరి', శంకర్ 'ఐ' చిత్రాల్లో నటించింది. ఈమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా 'ఏక్ దీవానా థా'. 'ఎవడు' (Yevadu) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత ఎమీ.. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించిన 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమాలో నటించింది. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ నటి.
తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేయడం వైరల్ గా మారింది. ఇంతకముందు ఈ భామ జార్జ్ పనాయోటౌ (George Panayiotou) అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత వారు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. కొడుకు పుట్టిన తర్వాత ఈ జంట మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.
అయితే తాజాగా ఈ బ్యూటీ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో (Ed Westwick) డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు వారు ఏ ప్రకటన చేయలేదు. ‘'గాసిప్ గర్ల్'లో (Gossip Girl) అనే వెబ్ సిరీస్ తో వెస్ట్విక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్లో సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వీరిద్దరూ కలుసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Amy Jackson: బ్రిటిష్ యాక్టర్‌తో రామ్ చరణ్ హీరోయిన్ డేటింగ్!