Beautiful Tourism Places: ఓ మధ్య తరగతి కుటుంబం ఒక ట్రిప్ ప్లాన్ చేయాలంటే..ఏడాది మొత్తం సేవింగ్స్ ఒకేసారి ఖర్చు పెట్టడమే. కానీ టూరిజం కోసం మీ శాలరీ నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరముండదు. ఇండియాలో తక్కువ బడ్జెట్లోనే తిరగగలిగే అత్యంత సుందరమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దేశంలోని టాప్ ఐదు అందమైన టూరిస్ట్ ప్రాంతాల గురించి తెలుసుకుందాం.
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మఠాలకు ప్రసిద్ధి. తక్కువ బడ్జెట్లో తిరిగేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ మంచి ప్రాంతం. ఇక్కడి అందమైన ప్రాంతాలు మీ మనస్సును ఆహ్లాదపరుస్తాయి. 5 వేల కంటే తక్కువ బడ్జెట్‌కే ట్రిప్ ఎంజాయ్ చేయవచ్చు
పచ్‌మడీ, మధ్యప్రదేశ్ వేసవిలో చాలామంది కొండ ప్రాంతాల్లో తిరిగేందుకు ఇష్టపడతారు. పచ్‌మడీ స్టేషన్ ట్రిప్ 5 వేలలోపే పూర్తి చేయవచ్చు. ఇక్కడ తిరిగేందుకు సరస్సులు, ప్రాకృతిక ప్రాంతాలు చాలా ఉన్నాయి.
మ్యాక్‌లియోడ్ గంజ్, హిమాచల్ ప్రదేశ్ ట్రెక్కింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మ్యాక్లౌడ్ గంజ్ చాలా ప్రముఖమైంది. టిబెట్ సంస్కృతి తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ హిల్ స్టేషన్ పూర్తిగా తక్కువ బడ్జెట్లోనిదే.
ల్యాన్స్‌డౌన్, ఉత్తరాఖండ్ పర్యాటకానికి ఉత్తరాఖండ్ చాలా ప్రసిద్ధి. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కావాలంటే..ల్యాన్స్‌డౌన్ సరైన ప్రాంతం. కేవలం 7వందల నుంచి 8 వందల్లో మంచి హోటల్స్ లభిస్తాయి.
కసౌల్, హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అందమైన నదులు, లోయలకు ప్రసిద్ధి. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ప్రాంతాలు మరెక్కడా ఉండవు. ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌల్ అత్యంత సుందరమైన ప్రాంతం.