Munugode Bypoll Symbol: మునుగోడు ఉప ఎన్నికలో మరో ట్విస్ట్. గుర్తుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రోడ్డు రోలర్ గుర్తు వివాదానికి తెర దించింది కేంద్ర ఎన్నికల సంఘం. యుగ తులసి పార్టీ కి చెందిన కె. శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి , మునుగోడు రిటర్నింగ్ అధికారికి సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.
మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ వేసిన శివకుమార్.. తనకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు. అయితే ఎన్నికల అధికారి మాత్రం రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్ కు కేటాయించ లేదు.గుర్తుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి గతంలోనే ఫిర్యాదు చేసింది. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని కోరింది. టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పిన గుర్తులతో రోడ్డు రోలర్ కూడా ఉంది. గతంలో రోడ్డు రోలర్ గుర్తుతో తమకు చాలా ఇబ్బంది జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. దీంతో కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తును ఎవరికి కేటాయించవద్దని టీఆర్ఎస్ ఒత్తిడి చేయడం వలనే తనకు కేటాయించలేదని శివకుమార్ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు.తనకు మొదట రోడ్డు రోలర్ కేటాయించి, ఆతర్వాత బేబీ వాకర్ గుర్తును కేటాయించారని ఈ నెల17న ఫిర్యాదు చేశారు శివకుమార్.
శివకుమార్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మునుగోడు ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కే శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని ఆదేశించింది. రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్ కు ఎందుకు కేటాయించలేదు వివరణ ఇవ్వాలని మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ ను ఆదేశించింది. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం అసహనం వ్యక్తం చేసింది. తనకు లేని అధికారాలతో రిటర్నింగ్ అధికారి గుర్తును మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందిఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారిపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై సంతోషం వ్యక్తం చేశారు శివకుమార్. రోడ్డు రోలర్ గుర్తు విషయంలో రెండు రోజుల క్రితం కీలక పరిణామాలు జరిగాయి. శివకుమార్ రోడ్డు రోలర్ గుర్తు కోరడంతో.. అతనితో నామినేషన్ విత్ డ్రా చేయించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యుగ తులసి పార్టీ కార్యాలయానికి వచ్చి శివకుమార్ తో మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. గుర్తు అయినా మార్చుకోవాలని చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివకుమార్ విడుదల చేశారు. ఆ విడియోలో ఎమ్మెల్యే దానం నాగేందర్ యుగతులసి కార్యాలయానికి వచ్చిన విజువల్స్ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Munugode Bypoll Symbol: మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రోడ్డు రోలర్ గుర్తుపై సీఈసీ సంచలనం
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్
శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించిన సీఈసీ
రోడ్డు రోలర్ గుర్తుపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీఆర్ఎస్