జీ తెలుగులో ప్రసారమైన జి సరిగమప ప్రోగ్రాం ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి.
ఆ ప్రోగ్రాం లో ఆమె పార్టిసిపెంట్ కాకపోయినా యశస్వి కొండేపూడి పాడిన పాటకు మెస్మరైజ్ అయ్యి వేదిక మీదకు వెళ్లి అతనికి హగ్ ఇవ్వడమే కాక అక్కడికక్కడే అతనికి ప్రపోజ్ చేస్తున్నట్లుగా మాట్లాడడంతో ఆమె ఒక్కసారిగా లైన్ లోకి వచ్చింది.
జీ తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించిన ఆమె ఈ మధ్య జబర్దస్త్ ప్రోగ్రాంలో కూడా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆమె తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు ఈ విషయాన్ని తలుచుకుంటూ ఆమె ఒక ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది.
ఆమె తండ్రి మరణించి కొన్ని రోజులు కూడా కాకముందే ఆమెకు కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండడంతో ఒక నెటిజన్ ఆమె మీద దారుణమైన కామెంట్ చేశాడు.
తండ్రి చనిపోయి పది రోజులు కూడా కాలేదు. నువ్వు ఎంతో బాధపడుతున్నావో అర్థమైంది అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.