7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఒక్కసారిగా రూ.9,000 పైగా పెరగబోతున్న శాలరీలు..

7th Pay Commission-DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కేంద్రం శుభవార్త తెలపబోతోంది. 40 శాతం ఉన్న డియర్‌నెస్ అలవెన్స్(DA)ను 50% చేయబోతున్నట్లు ఏఐసీపీఐ ఇండెక్స్ వివరాల్లో తేలింది దీని కారణంగా జీతాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

  • Feb 07, 2024, 13:02 PM IST
1 /6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతోంది. ఉద్యోగులందరికీ 2024 సంవత్సరంలోని జనవరి నెల నుంచి 50 శాతం DA కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. అయితే కేంద్రం ఇప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేకపోయినప్పటికీ.. ఇటీవలే ఏఐసీపీఐ ఇండెక్స్ వివరాల్లో తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 

2 /6

ప్రతి సంవత్సరంలోని నెలకు ఒకసారి ఏఐసీపీఐ ఇండెక్స్ విడుదలవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇండెక్స్ ఆధారంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు DA పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొట్టమొదటగా కొత్త సంవత్సరంలోని జనవరి నెలలో ఒకసారి, మరోసారి జూలై నెలలో డి ఎ పెంచుతూ వస్తోంది.

3 /6

ఈ సారి కేంద్ర ప్రభుత్వం పెంచే DA దాదాపు 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా బంపర్ ప్రయోజనం చేకూరుతుంది. దీంతోపాటు జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

4 /6

కేంద్ర ప్రభుత్వం DA ఆమోదం తెలపడమే కాకుండా భారీ మొత్తంలో జీతాలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం లెక్కలను బట్టి చూస్తే దాదాపు ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రూ. 9 వేల వరకు జీతం పెరిగే ఛాన్స్ ఉంది.

5 /6

కేంద్ర ప్రభుత్వం DA పెంపు కోసం 2016లో ఒక ప్రత్యేక నిబంధనను తీసుకువచ్చింది. అయితే దీని ప్రకారం..జీతాల పెంపు డిఎకు సంబంధించిన అన్ని అధికారిక నిర్ణయాలు కేంద్ర కేబినెట్ నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చి వరకు వేచి చూడాల్సి ఉంటుంది.  

6 /6

కేంద్ర కేబినెట్లో డిఏ ఆమోదం జరిగితే దాదాపు DA 50 శాతం వరకు చేరుకోగలుగుతుంది. దీని కారణంగా దాదాపు జీతం కూడా రూ. 9 వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం DA రాగా కేంద్ర క్యాబినెట్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటే 50 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి.