AP Free Gas: ఏపీ లో ఫ్రీ గ్యాస్ కావాలా.. ఈ రెండు ఉంటే చాలు..!

Free Gas: సూపర్ సిక్స్ హామీ లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అక్టోబర్ 31 నుండి అమలులోకి తీసుకొస్తున్నట్లు..మంత్రి నాదెండ్ల మోహనోహర్ తెలిపారు. ఈ ఫ్రీ గ్యాస్ కి ఎవరు అర్హులు అలానే ఇది ఎలా అప్లై చేయాలి అనే విషయాలను కూడా తెలియచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /7

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీపావళి సందర్భంగా గృహిణిలకి ఊరట కలిగించిందని చెప్పవచ్చు.  ఈనెల 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో వెల్లడించారు.   

2 /7

ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని , దీనికోసం గ్యాస్ కనెక్షన్ ఉండి తెల్ల రేషన్ కార్డు,  ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులని తెలిపారు. 

3 /7

అర్హత ఉన్న ప్రతి కుటుంబం కూడా అక్టోబర్ 31 నుండి మార్చి 31 వరకు ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డీబీటీ ద్వారా నగదు వెనక్కి ఇచ్చేస్తుందని కూడా తెలిపారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగితే 1967 అనే నెంబర్ కి  కాల్ చేసి సేవలు పొందవచ్చు అని కూడా మంత్రి తెలిపారు. 

4 /7

అంతేకాదు ప్రస్తుతం 1.47 కోట్లు వైట్ రేషన్ కార్డ్స్ ఉండగా.. వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఇకపోతే ఈ విషయం స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మినహా ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ లభిస్తుందని చెప్పి అందరికీ ఊరట కలిగించారని చెప్పవచ్చు.

5 /7

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకం కూడా ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో నమ్మకం ఏర్పడింది అని టిడిపి శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

6 /7

అలాగే ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలకు మంచి చేకూర్చడమే వారి పని అంటూ తెలిపారు.   

7 /7

అంతేకాదు అధికారంలోకి వస్తే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా మూడు సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని,  అలా ఏడాదికి రూ.2,684  కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x